ఈ సింగర్స్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది.. కారణం ఇదే!

First Published Nov 24, 2019, 11:56 AM IST

సినిమాకి అందరూ అభిమానులు కాకపోవచ్చు. కానీ సంగీతాన్ని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.  తెలుగు చిత్రాల్లో సంగీతానికి మంచి ప్రాధాన్యత ఉంటుంది. తప్పనిసరిగా పాటలు ఉంటాయి. ఈ తరం గాయకులు చాలా మందే ఉన్నారు. వారంతా ఏ చిత్రాల ద్వారా, ఏ పాటల ద్వారా పాపులర్ అయ్యారో తెలుసుకుందాం. 

సునీత : తన మధురమైన గాత్రంతో ఆకట్టుకునే సునీత ఎన్నో చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. 1995లో విడుదలైన గులాబీ చిత్రంతో సునీతకు ఫస్ట్ బ్రేక్ లభించింది. సునీత పాడిని 'ఈవేళలో నీవు' అనే సాంగ్ కు అద్భుతమైన గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తర్వాత సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత అనేక నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.
undefined
హేమ చంద్ర : యువ గాయకుడు హేమ చంద్రకు పరుగు చిత్రంలోని 'హృదయం ఓర్చుకోలేనిది' అనే పాటతో గుర్తింపు వచ్చింది.
undefined
గీతా మాధురి : హుషారెత్తించే పాటలు పాడడంలో గీత మధురైకి ప్రత్యేక శైలి ఉంది. చిరుత మూవీలోని 'చమ్కా చమ్కా చమ్కీ రే' అనే పాట మంచి గుర్తింపు తీసుకువచ్చింది. జనతా గ్యారేజ్ చిత్రంలో గీతామాధురి పడిన పక్కా లోకల్ అనే ఐటెం సాంగ్ మాస్ ప్రేక్షకులని ఒక ఊపు ఊపింది.
undefined
స్మిత : స్మిత ఇండియన్ పాప్ సింగర్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆమె తన సొంత ఆల్బమ్స్ తోనే పాపులారిటీ సంపాదించింది. 'మసక మసక చీకటిలో' అనే పాట సంచలనం సృష్టించింది. ఇక 'అనుకోకుండా ఒకరోజు' మూవీలోని 'ఎవరైనా చూసుంటారా' అనే పాటకూడా స్మితకు మంచి ఇమేజ్ తీసుకువచ్చింది.
undefined
ఉష : ఉదయ్ కిరణ్ సూపర్ హిట్ చిత్రం నువ్వు నేను మూవీలోని 'ప్రియతమా ఓ ప్రియతమా అనే పాట సింగర్ ఉషకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది.
undefined
కారుణ్య : సింగర్ కారుణ్యకు గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం అశోక్. ఈ మూవీలో కారుణ్య పాడిన 'ఏకాంతంగా ఉన్నా' అనే సాంగ్ సూపర్ హిట్ అయింది.
undefined
మాళవిక : మాళవికకు గుర్తింపు తీసుకువచ్చిన పాటలు బిల్లా చిత్రంలోని 'బొమ్మాలి'..ఏక్ నిరంజన్ మూవీలోని 'ఎవరూ లేరని అనకు'.
undefined
అనురాగ్ కులకర్ణి : యువ గాయకుడిగా దూసుకుపోతున్న అనురాగ్ కులకర్ణికి హైపర్ చిత్రంలోని బేబీ డాల్, శతమానం భవతి చిత్రంలోని 'మెల్లగా తెల్లారిందే అలా' అనే పాటలు గుర్తింపు తీసుకువచ్చాయి.
undefined
కౌశల్య : రవితేజ సూపర్ హిట్ చిత్రం ఇడియట్ లోని 'ఈరోజే తెలిసింది' అనే పాట కౌసల్యకు సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
undefined
రాహుల్ సిప్లిగంజ్ : ఇటీవల బిగ్ బాస్ 3 విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ ఓ సెన్సేషన్. హుషారెత్తించే పాటలు పాడడంలో రాహుల్ సిద్ధహస్తుడు. నితిన్ లై చిత్రంలోని 'బొంబాట్' పాటని పాడింది రాహులే.
undefined
శ్రావణ భార్గవి :సింగర్ శ్రావణ భార్గవి సింహా చిత్రంలోని 'సింహమంటి చిన్నోడే' అనే పాటతో పాపులర్ అయింది. ఆమె ఖాతాలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి.
undefined
మధు ప్రియ: వెండితెరపై కాకుండా మధుప్రియ సింగర్ గా ఎంతో గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక ఆమె ఫిదా చిత్రంలో పాడిన 'వచ్చిండే' పాటకు యువత నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.
undefined
సిద్ శ్రీరామ్ : యువ సంగీత దర్శకుడు సిద్ శ్రీరామ్ కు సాహసం శ్వాసగా సాగిపో మూవీలోని 'వెళ్ళిపోమాకే' అనే పాటతో అద్భుతమైన గుర్తింపు దక్కింది. రీసెంట్ గా సిద్ శ్రీరామ్ అల వైకుంఠపురములో చిత్రంలో 'సామజవరగమనా' అనే పాట పాడాడు. ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది.
undefined
చిన్మయి : చిన్మయి ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చిన్మయి అద్భుతమైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఏ మాయ చేసావే మూవీ లోని 'మనసా' అనే సాంగ్ చిన్మయికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
undefined
click me!