ఈ దసరాకి టాలీవుడ్ బాక్సాఫీస్ పై సీనియర్ హీరోలు మూకుమ్మడి దాడి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరు, వెంకీ, నాగ్, బాలయ్య చిత్రాలు దసరా బరిలో ఉన్నట్లు టాక్.
ఈ ఏడాది దసరా పండగ సినీ అభిమానులకు కనుల పండుగ చేయనుంది. ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి బరిలోకి దిగుతుండటమే దీనికి కారణం. సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్ 2' అక్టోబర్ 15న వస్తుండగా, ఆ మరుసటి రోజే ధనుష్ 'ఓం' సినిమా విడుదల కానుంది. ఇదే రేసులో మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' కూడా చేరవచ్చని వార్తలు వస్తున్నాయి.
24
జైలర్ 2
నెల్సన్ దర్శకత్వంలో వస్తున్న 'జైలర్ 2' పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. మొదటి భాగం బ్లాక్‌బస్టర్ అవ్వడమే దీనికి కారణం. మరోవైపు, రాజ్‌కుమార్ పెరియసామి డైరెక్షన్‌లో వస్తున్న 'ఓం' సినిమాలో ధనుష్‌తో పాటు సాయి పల్లవి, శ్రీలీల, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుండటంతో దసరా పోటీలో కీలకంగా మారింది.
34
విశ్వంభరకి మోక్షం
ఇక చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న 'విశ్వంభర' సినిమా కూడా అక్టోబర్ 16న విడుదలవుతుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. విజువల్ ఎఫెక్ట్స్ పనుల వల్ల ఆలస్యమైన ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని సమాచారం. అయితే, రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రమే కాదు సీనియర్ హీరోలందరూ దసరా సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి అక్టోబర్ లో తమ చిత్రాలని రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శకుటుంబం చిత్రం అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు. నాగార్జున 100వ చిత్రం కూడా దసరాకి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో చిత్రం కూడా దసరాకే రాబోతున్నట్లు లీకులు అందుతున్నాయి. ఇది కనుక జరిగితే మాత్రం ఈ దసరాకి సీనియర్ హీరోల బిగ్ ఫైట్ రసవత్తరంగా ఉంటుంది.