డబ్బుకోసం అమ్మను చంపేశారు.. హీరో నాగశౌర్య మేనత్త.. నటి లతాశ్రీ సెన్సేషనల్ కామెంట్స్..

Published : Jan 12, 2024, 11:17 AM IST

తన జీవితంలో జరిగిన సంఘటనలు గురించి వివరించారు టాలీవుడ్ సీనియర్ నటి లతాశ్రీ. హీరో నాగశౌర్య మేనత్త అయిన లతాశ్రీ.. తన తల్లి మరణం వెనుక ఉన్నది ఎవరో తెలిపి  ఎమోషనల్ అయ్యారు. 

PREV
16
డబ్బుకోసం అమ్మను చంపేశారు.. హీరో నాగశౌర్య మేనత్త.. నటి లతాశ్రీ సెన్సేషనల్ కామెంట్స్..

1990లలో ఆర్టిస్ట్ గా బాగా బిజీగా గడిపారు లతాశ్రీ. హీరోనయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి..  కేరక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు లత. 'ముద్దుల మేనల్లుడు' .. 'అబ్బాయిగారు' .. ' అల్లరోడు' .. ' ఆ ఒక్కటి అడక్కు' .. 'యమలీల'  ఇలా ఆమె నటించిన సినిమాలెన్నో. అననింటిలో క్యారెక్టర్ రోల్ చేసినా.. తన గ్లామర్ తో పాటు నటనతో అందరికి గుర్తుండిపోయారు. 
 

26

కాల క్రమంలో నటనకు దూరం అయ్యి.. కుటుంబానికి మాత్రమే పరిమితం అయ్యారు లతాశ్రీ. ఇక ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోగా కోనసాగుతున్న నాగశౌర్య లత మేనల్లుడే.. ఆమె అన్నకొడుకు టాలీవుడ్ ఎంట్రీకి కారణం అయిన ఆమె.. ప్రస్తుతం అన్న కుటుంబంతో దూరంగా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన లతావ్రీ తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలు పంచుకున్నారు. 

36

తాజా ఇంటర్యూలో లతాశ్రీ మాట్లాడుతూ .. తానకు ఎక్కువగా కన్నడ నుంచి అవకాశాలు వచ్చాయి అన్నారు లతాశ్రీ. కాని తన తల్లి తెలుగులోనే సినిమాలు చేయమని చెప్పడంతో.. ఇక్కడే చేస్తూ వచ్చానన్నారు. ఇక మలయాళం లో అవకాశాలు వచ్చినా వెళ్లలేదన్నారు లత. అక్కడ ఓ డైరెక్టర్ అందరిముందు నాకు నటన రాలేదు అని ఎగతాళి చేశాడని. అప్పటి నుంచి మలయాళం గుమ్మం తొక్కలేదన్నారు లత. 
 

46

ఇక తన తల్లి మరణం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు లతాశ్రీ. అమ్మకు గుండె పోటు రావడంతో హస్పిటల్ లో చేర్చాము.. బాగానే ఉంది.. మాట్లాడుతుంది. డిశ్చార్జ్ చేస్తారు అనుకుంటే.. కావాలని 18 రోజులు ఐసీయూలో పెట్టారు.. డబ్బుకోసం చేస్తున్నారని మాకు తెలిసి.. తీసుకెళ్ళిపోదాం అనుకున్నాము.. ఆవిషయం వారికి తెలిసింది.. ఆమరుసటిరోజే అమ్మ చనిపోయింది... అంటూ బాధపడ్డారు లతాశ్రీ. 
 

56

తనను తెలుగుదర్శకులు బాగా ప్రోత్సహించారన్నారు లతాశ్రీ..  ఇక ఈవీవీ గారు .. ఎస్వీ కృష్ణారెడ్డిగారు మంచి పాత్రలనిచ్చి నన్ను ప్రోత్సహించారు. కృష్ణగారి సినిమాలు ఎక్కువగా చేసే ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తుంటాను" అని అన్నారు. ఇక చాలా అవకాశాలు వచ్చి చేజారి పోయాయి.. కొన్ని నేనే వదిలేసుకున్నాను అన్నారు లతాశ్రీ. 

66

ఇక ఈ సందర్భంగా ఆమె తన లవ్ స్టోరీ గురించి కూడా చెప్పారు. తనకు మొదటి నుంచి జిమ్ చేయడం అలవాటు అని.. అలా జిమ్ చేస్తున్నప్పుడు జిమ్ ట్రైనర్ తో ప్రేమలో పడ్డానన్నారు. ఆ జిమ్ ట్రైనర్ తండ్రి డిప్యూటీ కలెక్టర్ కావడం.. ఆయనతో పాటు.. తన తల్లి కూడా పెళ్ళికి ఒప్పుకోలేదట. అయినా సరే అందరిని ఒప్పించే పెళ్ళి చేసుకున్నాం అన్నారు లతాశ్రీ. ప్రస్తుతం తన కుటుంబం హ్యాపీలైఫ్ ను లీడ్ చేస్తున్నారు లత. 
 

click me!

Recommended Stories