దానవీర శూర కర్ణలో ఎన్టీఆర్ కంటే ఎక్కువ పాత్రలు చేసిన చలపతిరావు,

Published : Dec 25, 2022, 09:28 AM IST

ఎన్టీఆర్ కు నమ్మిన వ్యాక్తిగా ఉన్నారు చలపతిరావు. పెద్దాయినతో కలిసి ఎక్కువ సినిమ్మాల్లో నటించారు. ఇక చలపతిరావు చేత ఒక సినిమాలో ఐదు పాత్రలు చేయించారు ఎన్టీఆర్. 

PREV
16
దానవీర శూర కర్ణలో ఎన్టీఆర్ కంటే ఎక్కువ పాత్రలు చేసిన చలపతిరావు,

టాలీవుడ్ కు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. కృష్ణం రాజు , కృష్ణ, కైకాల వరుసగాఈ లోకాన్ని వదిలి వెళ్ళగా.. ఆని బాధ నుంచి కోలుకోకముందే.. టాలీవుడ్ సీనియర్ నటులు చలపతిరావు కన్ను మూశారు. దాదాపుగా 1200 సినిమాల్లో నటించారు చలపతిరావు మూడు తరాల నటులతో కలిసి నటించారు. ముఖ్యంగా పెద్దాయిన ఎన్టీఆర్ కు నమ్మిన వ్యాక్తిగా చలపతిరావు మెలిగేవారు.  అన్నగారి మాటంటే చలపతిరావుకు వేదవాక్కులా ఉండేది. 

26

చాలా ఇంటర్వ్యూల్లో ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధం గురించి వివరించారు చలపతిరావు. అప్పట్లో తనను పెద్దాయిన ఎంతలా ఆదరించారో వెల్లడించారు. ముఖ్యంగా చలపతిరావు చేతర ఎన్టీఆర్ చేయించినప్రయోగం గురించి కూడా ఓసారి వివరించారు. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించిన దానవీర శూరకర్ణ  సినిమాలో చలపతిరావు చేత ఐదు పాత్రలుచేయిచారట. 

36

ఎన్టీఆర్ కొన్ని దశాబ్ధాల క్రితమే చరిత్ర సృష్టిచిన సినిమా దానవీరశూర కర్ణ. అప్పట్లో ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు. ఈమూవీలో సీనియర్ ఎన్టీఆర్ మూడు మెయిన్ క్యారెక్టర్లలో నటించారు. కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, కర్ణుడిగా మూడు పాత్రల్లో దుమ్మురేపారు.. నటసార్వభౌముడు. అయితే అదే సమయంలో చలపతిరావు ఎన్టీఆర్ కంటే రెండు పాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఇచ్చారట. 

46

దానవీర శూరకర్ణ సినిమాలో చలపతిరావు ఇంద్రుడిగా, జరాసంధుడిగా, అతిరధుడిగా మూడు ముఖ్యమైన పాత్రలతో పాటు.. రెండు గెస్ట్ రోల్స్ లో కనిపించారు. ఒక సినిమాలో ఇన్ని పాత్రలు చేసిన నటుడిగా అప్పట్లోనే చలపతిరావు రికార్డ్ సృష్టించారు. 

56

ఈ సినిమా షూటింగ్ టైమ్ లో ముందుగా ఇంద్రుడిగా చలపతిరావుకు అవకాశం ఇచ్చారట ఎన్టీఆర్. మరో గెస్ట్ రోల్ చేయాల్సి ఉంటుందని చెప్పారట. ఇక ఆరువాతి మూడు పాత్రలు అప్పటికప్పుడు.. ఎవరూ లేకపోవడంతో.. నువ్వే చేసే అంటూ పెద్దాయన చెప్పారంటూ.. చలపతిరావ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 
 

66

ఒక సినిమాలో ఇన్ని పాత్రలు..ఒకటే ముఖం కనిపిస్తే బాగోదేమో అన్నగారు అంటూ.. చలపతిరావు ఎన్టీఆర్ ను  అడిగారట. పర్వాలేదు బ్రదర్ అంటూ.. తన చేత ఐదు పాత్రలు చేయించారన్నారు చలపతిరావు.  ఎన్టీఆర్ తో తన అనుబంధం గురించి చాలా సందర్భాల్లో  చెప్పుకోచ్చారు చలపతి. 
 

click me!

Recommended Stories