అమ్మాయే ముందు ప్రపోజ్‌ చేసింది.. బెజవాడలో పెళ్లి.. చలపతిరావు క్రేజీ లవ్‌ స్టోరీ

First Published Dec 25, 2022, 9:09 AM IST

సీనియర్‌ నటుడు చలపతి రావు హఠాన్మరణం టాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా చలపతిరావు లవ్‌ స్టోరీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. 

చలపతిరావు ఐదున్నర దశాబ్దాలపాటు చిత్ర పరిశ్రమకు సేవలందించారు. ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ సినిమాల్లో నటించారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. విలన్‌గా, కామెడీ పాత్రల్లోనూ నటించి మెప్పించారు. అన్ని రకాల పాత్రల్లోనూ మెప్పించారు. ఎన్టీఆర్‌, కృష్ణ వంటి తొలి తరం హీరోలతోపాటు చిరంజీవి, నాగార్జు, బాలయ్య వంటి రెండో తరం నటులతో, అలాగే ఇప్పటి యాక్టర్స్ తోనూ నటించి మెప్పించారు. మూడు తరాలను చూసిన నటుడిగా నిలిచారు. 
 

ఇదిలా ఉంటే ఆయన జీవితంలో ఫ్యామిలీ, లవ్‌ లైఫ్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండటం విశేషం. ఆయన భార్య 27 ఏళ్ల వయసులోనే చనిపోయింది. చెన్నైలో ఉండగా ఓ రోజు తన ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో భార్య ఇందుమతి మరణించారు. దీంతో అప్పటి నుంచి పెళ్లికి దూరంగా ఉన్నారు చలపతిరావు. జనరల్‌గా చిత్ర పరిశ్రమలో భార్య చనిపోతే రెండో పెళ్లి అనేది కామన్. ఇప్పుడైతే ఏకంగా డైవర్స్ తీసుకుని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ చలపతిరావు తన భార్య ఇందుమతి చాలా యంగ్‌ ఏజ్‌లో చనిపోయినా ఆయన మరో పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోవడం విశేషం. 
 

అంతేకాదు తన పెళ్లి, ప్రేమకి సంబంధించిన క్రేజీ స్టోరీని చలపతిరావు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. బందరులో పీయూసీ చదువుతున్న సమయంలో ప్రేమలో పడ్డారట. ఇందుమతి అనే అమ్మాయి చలపతిరావుని ప్రేమించిందట. పొడువుగా, అందంగా ఉన్న ఆయన్ని చూసి ఇంప్రెస్ అయిన ఆమె తనే ప్రేమని వ్యక్తం చేసిందట. తనని పెళ్లి చేసుకుంటావా? అని అడగడంతో మరో మాట లేకుండా పెళ్లి చేసుకున్నారట చలపతిరావు. 

అయితే తమ ప్రేమకి సంబంధించి ఎలాంటి ప్రేమలేఖలు లేవన్నారు. ఆమెకి నచ్చడం, తన ప్రేమని వ్యక్తం చేయడం, పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయన్నారు. ఇందుమతి తన ఇష్టాన్ని వ్యక్తం చేసి వారం రోజులకే బెజవాడలోని తన స్నేహితులు తమకు ప్రేమ వివాహం చేశారని తెలిపారు చలపతిరావు. అంతేకాదు తన భార్య గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. తను ఎంతో ధైర్యవంతురాలు అని, ఏకంగా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి మా ఆయనకు ఎందుకు మంచి పాత్రలు ఇవ్వరని ప్రశ్నించిందని తెలిపారు. 
 

అంతేకాదు తన భార్యకి ఇచ్చిన మాట కోసం తాను జీవితంలో ఎప్పుడూ మందు, సిగరేట్‌ వంటి వ్యసనాలకు దూరంగా ఉన్నానని, ఎంతటి బాధలో ఉన్నా ఏ రోజూ వాటి జోలికెళ్లలేదన్నారు. అదే సమయంలో తాను చిన్న వయసులోనే చనిపోయినా తమ పిల్లల భవిష్యత్‌ ముఖ్యమని తాను రెండో పెళ్లి చేసుకోలేదని తెలిపారు. ఎంతో మంది రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడిచేసినా తాను దాన్ని తిరస్కరించారట. చలపతిరావుకి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు రవిబాబు ఉన్నారు. అమ్మాయిలు అమెరికాలో సెటిల్‌ అవ్వగా, రవిబాబు దర్శకుడు, నటుడు, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న విషయం తెలిసిందే. 

click me!