పుష్ప 2 లాంటి భారీ హిట్ తో 2024ని టాలీవుడ్ ఘనంగా ముగించింది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి చిత్రాలు ముస్తాబవుతున్నాయి. సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రమోషన్స్ తో ఆయా చిత్రాలు దూసుకుపోతున్నాయి. గట్టి పోటీ తప్పదు అన్నట్లుగా మూడు చిత్రాల జోరు కనిపిస్తోంది. అయితే రాంచరణ్ గేమ్ ఛేంజర్ చిత్రం పాన్ ఇండియా మూవీ కావడంతో అంచనాలు ఇంకాస్త ఎక్కువగా ఉండొచ్చు.
ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరించింది. కానీ ఏపీలో మాత్రం సమస్య లేదు. ఏపీ ప్రభుత్వం సంక్రాంతికి చిత్రాలకు ఊహించని గిఫ్ట్ సిద్ధం చేసింది. భారీగా టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలు కల్పించింది.
అదే విధంగా 1 గంట బెనిఫిట్ షోలకు కూడా అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోలకు 600 అదనంగా టికెట్ ధరలు పెంచుకోవచ్చు. డాకు మహారాజ్ చిత్రం విషయానికి వస్తే.. 110 రూపాయలు సింగిల్ స్క్రీన్స్ లో, 135 రూపాయలు మల్టిఫ్లెక్స్ లలో పెంచుకోవచ్చు. బెనిఫిట్ షోలకు 500 వరకు పెంచుకోవచ్చు.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి 75 రూపాయలు, 100 రూపాయలు పెంచుకునేలా అనుమతి ఇచ్చారు. ఈ చిత్రానికి బెనిఫిట్ షోల అవసరం ఉండదు. మొత్తంగా ఏపీ ప్రభుత్వం ఈ మూడు చిత్రాలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. తెలంగాణలో టికెట్ ధరలు పెంచుకోవడం జరగదు కాబట్టి ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.