2021 round up:భారీ ఫ్లాప్ కొట్టిన తెలుగు సినిమాలివే!

First Published | Dec 27, 2021, 7:31 AM IST

కరోనా భయాలను దాటి థియోటర్ లోకి అడుగుపెట్టినా ప్రేక్షకుడుకి నిరాశే కలిగించాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  

Alludu Adhurs


ఈ యేడు ప్రారంభమే సంక్రాంతికి వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా  'అల్లుడు అదుర్స్' ..అల్లుడు బెదుర్స్ అనిపించింది. మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేస్తుందని అనుకుంటే భారీగా దెబ్బ తింది.  సినిమాలో విషయం లేదని, అంతా కంగాళీగా ఉందని తేల్చేసారు. ఈ సినిమా డిజాస్టర్ ఫలితం చూసింది. బెల్లంకొండకు రాక్షసుడుతో వచ్చిన క్రేజ్ మొత్తం పోయింది.

Bangaru Bullodu


ఇక అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన 'బంగారు బుల్లోడు' టైటిల్ కి తగిన సత్తా చూపించలేక చతికిలపడ్డాడు. నరేష్ కామెడీ సినిమాలు చూడటం కష్టమని తేల్చేసే స్దాయిలో డిజాస్టర్ అయ్యింది. ఇక సుమంత్ చేసిన కన్నడ రీమేక్  'కపటధారి' డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా గురించి జనాలు తెలుసుకునేలోగా థియోటర్స్ నుంచి మాయమైంది.  ప్రదీప్ కృష్ణమూర్తి తెరకెక్కించిన కపటధారి సినిమా ట్రైలర్ ఆసక్తి కలిగించినా సినిమా మాత్రం నిలబడలేకపోయింది.



ఇక నితిన్ 'చెక్' సినిమాతో పెద్ద హిట్ కొడతారనుకున్నారు. ప్రమోషన్స్ తో చాలా హడావిడి చేశాడు. యేలేటి డైరక్టర్ కావటంతో ఈ సినిమా పై ఎక్సపెక్టేషన్స్ పెరిగాయి. అయితే ఈ సినిమా భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. జనాలతో  నితిన్  ఒక ఆట ఆడేసుకున్నాడు అనేై కామెంట్స్ వినిపించాయి.


మరో ప్రక్క అనీల్ రావిపూడి వంటి సూపర్ హిట్ డైరక్టర్ ని అడ్డం పెడుతూ  రాజేంద్ర ప్రసాద్ - శ్రీవిష్ణు కాంబినేషన్లో 'గాలి సంపత్' వచ్చింది. ఈ సినిమా వచ్చింది వచ్చినట్లే గాలిలో కలిసి పోయింది. ఈ సినిమా ఆ స్దాయి డిజాస్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.  భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం దారుణంగా నిరాశ పరిచింది.  శ్రీవిష్ణు, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన గాలి సంపత్ కూడా నిరాశ పరిచింది. 


ఆర్ ఎక్స్ 100 తో క్రేజ్ తెచ్చుకున్న కార్తికేయ హీరోగా వచ్చిన  'చావుకబురు చల్లగా' ...థియోటర్స్ లో టైటిల్ కు తగ్గట్లే చచ్చిపోయింది. స్మశానంలో మొదలయ్యే ఈ లవ్ స్టోరీని కొత్తగా దర్శక,నిర్మాతలు ఫీలయ్యారు కానీ,  ప్రేక్షకులు స్వాగతించలేకపోయారు. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నుంచి వచ్చిన చావు కబురు చల్లగా   డిజాస్టర్ అయింది. ఈ సినిమా ఫుల్ రన్‌లో కనీసం 4 కోట్లు కూడా వసూలు చేయలేదు.


 ఇక ఎంతో హైప్ తో రానా హీరోగా వచ్చిన  'అరణ్య'కి మిగిలింది అరణ్య రోదనే. రానా దగ్గుబాటి హీరోగా ప్రభు సాల్మాన్ తెరకెక్కించిన బహుభాషా చిత్రం అరణ్య. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందిన ఈ చిత్రం భారీ డిజాస్టర్ అయ్యింది. ఎంతలా అంటే హిందీ డబ్బింగ్ వెర్షన్ ని రిలీజ్ చేయటానికి కూడా భయపడే స్దాయిలో . రానా ఆ దెబ్బ నుంచి కోలుకుని మరో సినిమా రిలీజ్ కు ఇంకా రాలేదు. భీమ్లానాయక్ తో బయటపడచ్చేమో.

మొదట నుంచీ మంచు విష్ణు సినిమాలకు భాక్సాఫీస్ దగ్గర  చుక్కెదరు అవుతోంది. ఈ సారి అదే జరిగింది.  కాజల్ ను చెల్లెలి పాత్రలో చూపిస్తూ వచ్చిన 'మోసగాళ్లు' అదే ఫలితాన్ని అనుభవించవలసి వచ్చింది. ఈ సినిమా కు ఓ రేంజిలో ప్రమోట్ చేసారు. అయితే ప్రమోషన్ చేసినంత సేపు కూడా థియోటర్ లో నిలబడలేదు. మంచు విష్ణు ఇప్పుడు శ్రీనువైట్ల తో సినిమా చేస్తున్నారు. ఆ సినిమాపైనే ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు. మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ తెరకెక్కించిన చిత్రం మోసగాళ్లు. భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం కనీసం కోటి రూపాయల షేర్ కూడా వసూలు చేయలేదు.


శర్వానంద్ 'శ్రీకారం' పై బాగా నమ్మకం పెట్టుకున్నాడు. మోడ్రన్ రైతు కథగా వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో నిలబడుతుందని ప్రమోషన్స్ చూసి అందరూ అనుకున్నారు. కానీ ఆడియన్స్ ఈ సినిమాని ఎక్కువసేపు భరించలేకపోయారు. ఫ్లాఫ్ అయ్యింది.  పాజిటివ్ టాక్‌తో ఓపెన్ అయిన శ్రీకారం కేవలం 9.41 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది.

Rangde


ఇక నితిన్, కీర్తి సురేష్ క్రేజీ కాంబినేషన్ లో  'రంగ్ దే' అనే సినిమా వచ్చింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. నితిన్, కీర్తి సురేష్ మధ్య వచ్చే సీన్స్ నవ్వించకపోగా ఏడిపించాయి. కీర్తి సురేష్ అభిమానులు సైతం నిరాశపడ్డారు.  వెంకీ అట్లూరీ తెరకెక్కించిన రంగ్ దే కూడా మొదట్లో పర్లేదనిపించినా.. చివరికి ఫ్లాపు లిస్టులోకే చేరిపోయింది.

ఇక నాగార్జున  'వైల్డ్ డాగ్' గురించి అయితే చెప్పుకోనక్కర్లేదు. నాగార్జున హీరోగా కొత్త దర్శకుడు అసిషోర్ సోలోమన్ తెరకెక్కించిన ఈ చిత్రానికి టాక్ బాగానే వచ్చినా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం దారుణంగా దెబ్బ తింది. అలాగే ఆది చేసిన 'శశి' సినిమా ది అదే పరిస్దితి. నాగ్ వైల్డ్ డాగ్ ఆ తర్వాత నెట్ ప్లిక్స్ లో     హిట్ అయింది కానీ శశి ఎక్కడా ఏమీ కాలేదు. సినిమా ఆ స్దాయి డిజాస్టర్ అయ్యింది. 
 


  'పాగల్' సినిమాతో విష్వక్ సేన్ చేసిన హడావిడి అయితే మామూలుగా లేదు. సినిమా చూసినవాళ్లంతా ఎంత నీరసపడ్డారంటే మాట్నీ షోకు జనం లేనంత. ఈ సినిమా ఆ స్దాయిలో డిజాస్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.  హిట్ కాకపోతే తన పేరు మార్చుకుంటానంటూ శపథం చేసాడు. కానీ పాగల్ సినిమా వచ్చినట్లు కూడా ఆడియన్స్‌కు గుర్తు లేదు.

Sridevi Soda Cente


సుధీర్ బాబు హీరోగా వచ్చిన 'శ్రీదేవి సోడా సెంటర్' .పలాస దర్శకుడి నుంచి వచ్చిన సినిమా కావడంతో ఆ ఆసక్తి కూడా అందరిలోనూ కనిపించింది. అలాగే అవసరాల శ్రీనివాస్  'నూటొక్క జిల్లాల అందగాడు' సినిమాలను జనాలు పెద్దగా పట్టించుకోలేదు. రెండు సరైన కథ,కథనం లేక దారి తప్పాయి. ఈ సినిమా పై క్రియేట్ చేసిన ఎక్సపెక్టేషన్స్ ఎంతోసేపు నిలబడలేదు.

Kondapolam

 'కొండపొలం' సినిమాని క్రిష్ వంటి దర్శకుడు డీల్ చేయటం, నవల పెద్ద హిట్ అవటంతో చాలా అంచనాలు పెట్టుకున్నారు. అయితే సినిమా సెకండాఫ్ పరమ బోర్ వచ్చేసింది. చాలా మంది సీనియర్ హీరోయిన్ గా రకుల్ మైనస్ అయిందని అన్నారు. 'ఉప్పెన' క్రేజ్ తో థియోటర్ కు పరుగెట్టిన వాళ్లు  చూడటానికి ఇబ్బంది పడ్డారు.  ట్రైలర్ విడుదల తర్వాత భారీ బిజినెస్ జరిగింది. అయితే విడుదల తర్వాత కేవలం ప్రశంసలు వచ్చాయి 


ఈ యేడు బాగా క్రేజ్ తెచ్చుకున్న సినిమాల్లో  'మహాసముద్రం' ఒకటి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరక్టర్ మాటలు మామూలుగా లేవు ..ఇంతా చేస్తే సినిమా భారీ డిజాస్టర్. సిద్దార్ద,శర్వానంద్ ని తట్టుకోవటం చాలా కష్టమైంది.

 
సాయి ధరమ్ తేజ  'రిపబ్లిక్' విషయానికి వస్తే  కంటెంట్ మంచిదే కానీ దానిని చూపిన విధానం సరిగ్గా లేదని తేల్చేసారు. జనానికి కావాల్సిన ఎంటర్టైన్ మెంట్ ఇవ్వకపోవటంతో డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా ఇంత పెద్ద ఫ్లాఫ్ అవుతుందని ఊహించని దేవకట్టా నిలబడదామని చాలా వరకూ సోషల్ మీడియా ద్వారా ప్రయత్నించారు.

Lakshya

 
నాగశౌర్య నటించిన వరుడు కావాలి, 'లక్ష్య' ఎంత ప్రయత్నించినా లక్ష్యానికి చేరుకోలేకపోయాయి. రెండు సినిమాలు స్క్రిప్టు సరిగ్గా లేక భాక్సాఫీస్ దగ్గర చతికల పడ్డాయి. ఈ సినిమాలు ఈ స్దాయి డిజాస్టర్ అవుతాయని ఎవరూ ఊహించలేదు. సిక్స్ ప్యాక్ లు సినిమాని బ్రతికించలేవని అర్దమైపోయింది.

Also read Roundup 2021: పవన్ ప్రసంగం, మా ఎన్నికలు, సమంత విడాకులు... 2021లో టాలీవుడ్ ని ఊపేసిన వివాదాలు

Latest Videos

click me!