#Naa Saami Ranga Review: నా సామిరంగ ట్విట్టర్ రివ్యూ.. కింగ్ నాగార్జున మాస్ కమ్ బ్యాక్..

First Published | Jan 14, 2024, 8:51 AM IST

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం నా సామిరంగ. మలయాళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈమూవీని విజయ్ బిన్నీ డైరెక్ట్ చేశారు. ఈరోజు (14 జనవరి) సంక్రాంతి కానుకగా..ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈసినిమా గురించి.. ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్.. ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.మరి వారు ఏమంటున్నారో చూద్దాం.   

మలయాళం సూపర్ హిట్ అయిన  పొరింజు మరియం జోష్ మూవీని బేస్ చేసుకుని నా సామిరంగ సినిమా తెరకెక్కింది. విజయ్ బిన్నిని దర్శకుడిగాపరిచయం చేస్తూ.. కింగ్ నాగార్జున్ స్పెషల్ లుక్ లో కనిపించినసినిమా ఇది. ఈమూవీని ప్రముఖ  నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై చిట్టూరి శ్రీనివాస , పవన్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు.

కింగ్  నాగార్జున అక్కినేని సరసన .. కన్నడ భామ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించగా.. టాలీవుడ్ హిరోలైన అల్లరి నరేష్.. రాజ్ తరుణ్ కలిసి ఈసినిమాను మల్టీ స్టారర్ గా మార్చేశారు. ఇక  మిర్నా మీనన్, రుక్సర్ థిల్లాన్ ఇద్దరు ఈసినిమాకు మరికొంత గ్లామర్ ను ఆడ్ చేయగా..  నాజర్, రావు రమేష్ లాంటి సీనియర్లు నటించి నాసామిరంగ సినిమా కథకు తగిన వేయిట్ ను అందించారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 14 తేదీన రిలీజ్ అయిన ఈసినిమా పై నెటిజన్లు ఏమంటున్నారంటే..?


నాసామిరంగ సినిమా యావరేజ్ రివ్యూస్ వస్తున్నాయి. బాగుందిఅంటున్నారు కాని..సూపర్ హిట్  అని కాన్ఫిడెంట్ తో చెప్పలేకపోతున్నారు. ఇక కింగ్ నాగార్జున పర్ఫామెన్స్, యాక్షన్ సీన్స్ పై మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంట్రడక్షన్ ఫైట్ బాగుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ మూవీ అయితే బాగుంది.. బోరింగా అనిపించలేదు... అంటూ ట్వీట్ చేశారు. 

ఇక ఈసినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ పాత్రలపై కూడా ట్వీట్లు కనిపిస్తున్నాయి.  ఇద్దరు తమ పాత్రలకుతగ్గట్టు అదరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చినట్టు చెపుతున్నారు. ఎవరికి వారు పోటీ పడి నటించారని అంటున్నారు. 

మరీ మఖ్యంగా నాగార్జున ఎంట్రీ సీన్.. ఆషికాతో లవ్ ట్రాక్ బాగా వర్కౌట్ అయ్యిందంటున్నారు. సాంగ్స్ అంత హిట్ అవ్వకపోయినా.. సినిమాకు తగ్గట్టు ఉన్నాయని ట్వీట్ చేశారు మరో నెటిజన్. అంతే కాదు ప్రీ క్లైమక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ ఎమోషనల్ గా కనెక్ట్ చేసే ప్రయత్నంచేశాడు దర్శకుడు. ఈ విషయంపై కూడా ఆడియన్స్ స్పష్టంగా ట్వీట్లు కనిపిస్తున్నాయి. 
 

నా సామిరంగ సినిమా ఫస్టాఫ్ బాగుంది. నాగార్జున కనిపించే సీన్లు చాలా బాగున్నాయి అంటూ సినిమాలోని యాక్షన్ వీడియోను నెటిజన్ పోస్టు చేశారు.ఇంటర్వెల్ యాక్షన్ సీన్లు అదరిపోయాయి. సైకిల్ చైన్ రెఫరెన్స్ బాగుంది. కింగ్ నాగార్జున ర్యాంప్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.నా సామిరంగ సంక్రాంతి ట్రీట్.. ఈ సినిమా మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. కింగ్ నాగార్జున కమ్ బ్యాక్ అయ్యారు.. ఇక ఈమూవీ అస్సలు మిస్ అవ్వకండీ అంటూ.. మరో ఫ్యాన్  ట్వీట్ చేశారు.
 

Latest Videos

click me!