ఆ పరిణామాల తర్వాత పవిత్రలో తాను అన్ని చూసినట్టు చెప్పారు. ఓ అమ్మోరు, అమ్మగా, కూతురుగా, ఓ ఫ్రెండ్‌గా, ఒక గైడ్‌గా, శ్రేయోభిలాషిగా, తాను ఉన్నానని భరోసా ఇచ్చే పెద్ద సపోర్టర్‌గా నిలిచిందని, దీంతో ఆమెలో తాను అన్ని చూసుకుంటున్నట్టు తెలిపారు నరేష్. పవిత్ర తన పక్కన ఉంటే మరోకరిని చూడాల్సిన అవసరం, మరొకరిని చూసుకోవాల్సిన అవసరం లేదని బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు నరేష్. తనకు ఇంకా ఎవరితోనూ పనిలేదని చెప్పాడు. ఆమెలోనే అందరు కనిపిస్తున్నారని చెప్పాడు నరేష్.