అల్లు అర్జున్ కు ఆ రెండు సెంటిమెంట్లు..? సాధ్యమైనంత వరకూ పాటిస్తాడట..నిజమేనా..?

Published : Sep 05, 2023, 01:25 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్లు ఉన్నారు. అయితే అందులో కొంత మంది స్టార్స్ లక్కును నమ్మితే.. మరికొంత మంది లక్కుతో పాటు కొన్ని సెంటిమెంట్లు కూదా ఫాలో అవుతుంటారు. అలాంటి వారిలో బన్నీ కూడా ఉన్నారు. ఆయనకు కూడా రెండు సంటిమెంట్లు ఉన్నాయట.   

PREV
16
అల్లు అర్జున్ కు  ఆ రెండు సెంటిమెంట్లు..? సాధ్యమైనంత వరకూ పాటిస్తాడట..నిజమేనా..?

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో సెంటిమెంట్స్ కు కొదవ లేదు.. స్టార్స్ కు కలిసొచ్చిన ఫార్ములాలను సెంటిమెంట్లుగా పెట్టుకుంటుంటారు. మరీ ముఖ్యంగా హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలకు ఆ ఛాన్స్ ఎక్కువగా ఉంటంది. వారు ర‌క‌ర‌కాల సెంటిమెంట్స్ ను ఫాలో అవుతుంటారు. ఈ లిస్ట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కు కూడా ఉన్నారు ఆయన కూడా తన సినిమాల విషయంలో ఓ రెండు సెంటిమెంట్లను పరిస్థితులను బట్టి  ఫాలో అవుతుంటాడట. ఇంతకీ ఏంటవి. 

26

మెగా హీరోగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి.. తన సొంత టాలెంట్ తో ఎదిగాడు అల్లు అర్జున్(Allu Arjun). సినిమా కోసం ఎంత కష్టాన్ని అయినా.. ఇష్టంగా మార్చుకుంటాడు బన్నీ. కష్టపడి పనిచేస్తాడు. సినిమా వారసుడిని అన్న గర్వం లేకుండా ఎలాంటి పాత్రలు చేయడానికి అయినా సై అంటాడు బన్నీ. అలా కష్టపడతాడు కాబట్టే... ఇండస్ట్రీలో తనకంటూ ఓన్ ఇమేజ్ ను సాధించాడు.. స్టార్ డమ్ తో దూసుకుపోతున్నాడు. 

36

అల్లు అర్జున్ యమా హ్యాడ్సమ్ గా ఉంటాడు..నటన పరంగా తిరుగు లేదు. అంతే కాదు బన్నీ అద్భుత‌మైన డ్యాన్స‌ర్ గా పేరు తెచ్చుకున్నాడు. కోట్లాది మంది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్నాడు. ఇక పుష్ప(pushpa)` సినిమాతో పాన్ ఇండియాను టచ్ చేవాడు. దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ సాధించి.. దానితో పాటే.. రీసెంట్ గా  ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డును కూడా సాధించాడు. 

46

ప్ర‌స్తుతం `పుష్ప 2 షూటింగ్ లో ఉన్నాడు ఐకాన్ స్టార్.. ఈసినిమాను అంతంకు మించి ఉండేలా తెరకెక్కిస్తున్నారట. షూటింగ్ దశలో ఉన్న పుష్న2న పరుగులు పెట్టిస్తున్నారు టీమ్. ఇందులో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా న‌టిస్తోంది.
 

56

పుష్ప 2 అనంత‌రం త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్(Trivikram Srinivas) తో ఓ సినిమా, సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా చేసేందుకు అల్లు అర్జున్ క‌మిట్ అయ్యాయి. ఇక‌పోతే అల్లు అర్జున్ సినీ కెరీర్ లో ఆయ‌న‌కు రెండు సెంటిమెంట్లు బాగా క‌లిసొచ్చాయి. అందులో ఏప్రిల్ నెల ఒక‌టి. ఏప్రిల్ లో సినిమాను విడుదల చేస్తే.. అల్లు అర్జున్ కు హిట్ ఖాయం. అలా అల్లు అర్జున్ న‌టించిన నాలుగు సినిమాలు ఏప్రిల్ లో విడుద‌లైన బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించాయి.
 

66

ఈ లిస్ట్ లో బ‌న్నీ, రేసు గుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, స‌రైనోడు వంటి సినిమాలు ఉన్నాయి. ఇవ‌న్నీ ఏప్రిల్ నెల‌లోనే విడుద‌లైన సూప‌ర్ హిట్ గా నిలిచాయి. అలాగే అల్లు అర్జున్ కు క‌లిసొచ్చిన మ‌రొక సెంటిమెంట్.. వైజాగ్. సినిమాలో క‌నీసం ఒక్క సీన్ ను అయినా వైజాగ్ లో చిత్రీక‌రిస్తే.. హిట్ ప‌క్కా అని అల్లు అర్జున్ న‌మ్ముతాడ‌ట‌. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories