స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) ఈ ఏడాది క్రిస్టమస్ వేడుకలను మరింత స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంది. తన ప్రియుడు షంతనుతో కలిసి వేడుకల్లో పాల్గొంది. క్రిస్టమస్ వేడుకల్లో భాగంగా బ్లాక్ ట్రీని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా తను, షంతను క్రిస్టమస్ ట్రీ వద్ద ఉన్న ఫొటోను పంచుకుంది. ట్రావెలింగ్ చేస్తూ బిజీగా ఉన్న వారిద్దరూ క్రిస్టమస్ ట్రీ కోసం ఎంత కష్టపడ్డారో వివరించింది. తమకు, తమతోపాటు స్నేహితులు, అభిమానులందరికీ మంచి జరగాలని కోరుకుంది.