ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో పవన్ కళ్యాణ్ బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి హాజరు కాబోతున్నారు. మెగా నందమూరి అభిమానుల్లో ఈ న్యూస్ చాలా ఆసక్తికరంగా మారింది. పవన్, బాలయ్య ఇద్దరూ భిన్నమైన శైలి కలిగిన బిగ్ స్టార్స్. గతంలో వీరిద్దరికి అంతగా పరిచయం కూడా లేదు. దీనితో అన్ స్టాపబుల్ షో లో బాలయ్య, పవన్ మధ్య సంభాషణ ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ నెలకొంది.