శ్రీలీల అందానికి ఫిదా అవ్వనివారు ఉంటారా...? అద్భుతాలకుఆశ్చర్యపోనివారు ఉంటారా..? శ్రీలీల అందం కూడా అంతే.. పాల వన్నె సొగసులతో.. యువతకు నిద్రలేకుండా చేస్తోంది శ్రీలీల. తన సొగసులతో తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. హీరోయిన్ గా బిజీగా లేని టైమ్ లో సోషల్ మీడియాలోను పెద్దగా యాక్టీవ్ గా లేదు శ్రీలీల. కాని ప్రస్తుతం ఊపిరి తీసుకోవడానికి కూడా టైమ్ లేని సమయంలో కూడా వరుస ఫోటో షూట్లతో.. తన ఫాలోయింగ్ ను అమాంతం పెంచుకుంటోంది బ్యూటీ.
అయితే ఏఫోటో షూట్ లో కూడా హద్దులుదాటకుండా చూసుకుంటోంది శ్రీలీల. ఎక్కవగా స్కిన్ షో చేయకుండా.. చూపించి చూపించకుండా... కనిపించి కనిపించకుండా.. జాగ్రత్త పడుతోంది. అయితే ఆమె కోసం నెటిజన్లు ఆరాటపడుతున్నారు. శ్రీలీలకు సెపరేట్ గా అభిమాన సంఘాలు కూడా స్టార్ట్ అయ్యాయట
పెళ్లి సందడి అనే ప్లాప్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది శ్రీలీల. ఆమెఅందానికి, నటనకు ఫిదా అయిన మేకర్స్ వరుస ఆఫర్లతో మంచెత్తారు. ప్రస్తుతం స్టార్ హీరోలు కూడా శ్రీలీల డేట్స్ కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంది అంటే.. ఆమె డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం అవుతుంది.
హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉంది శ్రీలీల. వరుస సినిమాలతో దుమ్మురేపుతోంది. ఆమె చేతిలో ప్రస్తుతం 10 సినిమాల వరకూ ఉన్నాయి. ఈ ఏడాది మాత్రమే కాదు.. వచ్చే ఏడాది కూడా ఆమెహవానే నడిపించబోతోంది. స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా మెరుపులు మెరిపించబోతోంది శ్రీలీల.
శ్రీలీల రాంగ్ స్టెప్ వేయకుండా ఉంటే.. స్టార్ హీరోయిన్ స్టేటస్ సాధించడానికి పెద్దగా టైమ్ పట్టదు. కాని కృతీ శెట్టి లా సడెన్ గా పడిపోతే.. ఇబ్బందులుతప్పవు. తెలుగులో ఒక ఊపు ఊపి ప్రస్తుతం కామ్ అయ్యింది కృతి శెట్టి. ఆమె అవకాశాలు కూడా శ్రీలీల కొట్టేసిందన్న విమర్శ ఉంది. ఈక్రమంలో శ్రీలీల ప్లాప్ లు రాకుండా చూసుకుంటే..
ప్రస్తుతం ఉన్న సినిమాలు రిలీజ్ అయ్యే వరకు ఆమె స్టార్ హీరోయిన్ గా అవతరించడం ఖాయం అంటున్నారు. ముందు ముందు ఇంకాస్త ముందుకెళ్ళి. . అందాల విందు చేయడానికి రెడీగా ఉంది శ్రీలీలా. ఇక తాజాగా ఆమె రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. రామ్ హీరోగా బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన స్కంద మూవీలో నటించింది శ్రీలీలా.. ఆమె నటనకు మంచి పేరు వచ్చింది కాని.. సినిమా మాత్ర యావరేజ్ గా నిలిచింది.
ప్రస్తుతం గుంటూరు కారంసినిమాలో మహేష్ బాబుతో కలిసి నటిస్తోంది శ్రీలీల. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా శ్రీలీల నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బన్నీతో త్రివిక్రమ్ చేయాల్సిన సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా అడిగినట్టు తెలిసింది. ఆమె డేట్స్ అజెస్ట్ అవ్వవని చెప్పడంతో.. శ్రీలీలకు అల్లు అర్జున్ ఓ చిన్న క్లాస్ తీసుకున్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.