Rashmika Mandanna deepfake video
రష్మిక మందాన డీప్ ఫేక్ వీడియో ఇండియా వైడ్ హాట్ టాపిక్. రష్మికది అంటూ బోల్డ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా మంది అది ఒరిజినల్ అని నమ్మారు. కొందరు రష్మికను తిడుతూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. అది డీప్ ఫేక్ వీడియో, ఒరిజినల్ కాదని జర్నలిస్ట్ ఒకరు ఒరిజినల్ వీడియో పోస్ట్ చేశారు.
రష్మిక ముఖంతో డీప్ ఫేక్ వీడియో చేయడాన్ని పలువురు ఖండించారు. అమితాబ్, నాగ చైతన్యతో పాటు మరికొందరు రష్మికకు మద్దతుగా నిలిచారు. సాంకేతికత దుర్వినియోగం అవుతుంది. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తలచుకుంటే భయమేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రష్మిక సైతం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తనకు మద్దతుగా ఉంటున్న కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులకు ధన్యవాదాలు. ఇలాంటి వీడియో నేను కాలేజ్ లేదా స్కూల్ లో చదువుకునే రోజుల్లో వైరల్ అయితే పరిస్థితి ఏంటని వాపోయింది. కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Rashmika Mandanna deepfake video
ఈ ఘటనతో ఒరిజినల్ వీడియోలో ఉన్న మహిళ ఇండియాలో పాపులర్ అయ్యారు. ఆమె ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ ని నెటిజెన్స్ చెక్ చేస్తున్నారు. రష్మిక పేరిట వైరల్ అయిన వీడియోలో ఉన్న యువతి పేరు జరా పటేల్. ఈమె భారతీయ మూలాలున్న బ్రిటన్ యువతి. అక్కడే పుట్టి పెరిగింది.
Rashmika Mandanna deepfake video
వృతి రీత్యా ఇంజనీర్ అట. మెంటల్ హెల్త్ అడ్వొకేట్ అని కూడా తన ప్రొఫైల్ లో మెన్షన్ చేసింది. జరా పటేల్ ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తే... హాట్ వీడియోలు, ఫోటో షూట్స్ తో నిండిపోయింది. ఆమె తరచుగా బోల్డ్ కంటెంట్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తారు. ఆమెకు నాలుగున్నర లక్షల ఫాలోవర్స్ ఉన్నారు.
Rashmika Mandanna deepfake video
జరా పటేల్ దృష్టికి ఫేక్ డీప్ వీడియో వెళ్ళింది. దీంతో ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె స్పందించారు. ''అందరికీ హాయ్... నా బాడీ ఉపయోగించి ఒక బాలీవుడ్ యాక్ట్రెస్ డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేశారని నా దృష్టికి వచ్చింది. ఆ డీప్ ఫేక్ వీడియోతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ పరిణామం నన్ను బాగా కలచి వేసింది.
ఇకపై అమ్మాయిలు, మహిళలు సోషల్ మీడియాలో తన సమాచారం పంచుకునేందుకు చాలా భయపడతారు. సోషల్ మీడియా కంటెంట్ పై స్పందించే ముందు అందరూ నిజం ఏమిటో చెక్ చేసుకోండి...'' అని ఆమె కామెంట్ చేశారు. జరా పటేల్ పోస్ట్ వైరల్ అవుతుంది.