నువ్వు పూజా హెగ్డే కాదు..పిజ్జా హెగ్డేవి బుట్టబొమ్మపై నెటిజన్ల కామెంట్లు వైరల్..

First Published | Feb 10, 2024, 6:20 PM IST

పాపం పూజా హెగ్డే వరుస ఫ్లాప్ లతో ఐరన్ లెగ్ అన్న పేరు తెచ్చుకుంది. అయినా సరే ధైర్యంగా నిలబడే ప్రయత్నం చేస్తోంది. తాజాగా పూజా సబంధించిన కొన్నిపోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

గతంలో వరుస హిట్ సినిమాలతో దూసుకుపోయిన పూజా హెగ్డే.. స్టార్ హీరోయిగ్ వెలుగు వెలిగింది.  తెలుగులో వరుస సినిమాలు చేసిన పూజాహెగ్డేకి ఇప్పుడు చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. సౌత్ లో సినిమాలు చేస్తున్న సమయంలో మళ్ళీ బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సినిమాలు చేసింది. 

బాలీవుడ్ లో పూజా సినిమాలు వరుసగా ప్లాప్ లుగా నిలవడంతో.. టాలీవుడ్ వైపు చూసింది. కాని ఇక్కడా అక్కడా కూడా వరుస  పరాజయాలు ఆమెను పలకరించడంతో ..  ఇప్పుడు అక్కడ కూడా ఆఫర్లు కరువయ్యాయి ఈ బుట్టబొమ్మకి.


గుంటూరు కారంతో పాటు..  చేతిలో ఉన్న మరో రెండు తెలుగు సినిమాలు ఏవో కారణాలతో వదిలేసుకుంది బ్యూటీ. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో గతంలో ఒప్పుకున్న ఒక్క హిందీ సినిమా మాత్రమే ఉంది. చేతిలో ఆఫర్స్ లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది. వరుసగా ఫోటోలు పోస్ట్ చేస్తూ సందడి చేస్తోంది. 

తాజాగా పెద్ద పిజ్జాతో పూజా కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. అంత పెద్ద పిజ్జాను చేతిలోకి తీసుకుని ఆమె తీనేస్తుందా ఏంటీ అన్నట్టుగా ఫోజు ఇచ్చింది. ఇంతకీ ఈ పీజ్జా కథ ఏంటంటే..  నిన్న ఫిబ్రవరి 9 వరల్డ్ పిజ్జా డే కావడంతో ఓ పిజ్జా షాప్ లో మాములు పిజ్జా సైజుకి నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉండే ఒక పిజ్జాని పట్టుకొని పూజా హెగ్డే ఫోటోలకు పోజులిచ్చింది. 

ఇక ఆ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి హెవీ వెయిట్ లిఫ్టింగ్ అంటూ సరదాగా పోస్ట్ చేసింది. దీంతో పిజ్జాతో పూజాహెగ్డే ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కొందరు సరదాగా పూజా హెగ్డే కాదు పిజ్జా హెగ్డే అని కామెంట్స్ చేస్తున్నారు.
 

Latest Videos

click me!