Deepika Padukone : ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’.. దీపికా పదుకొణె రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

First Published | Feb 10, 2024, 6:04 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) ప్రభాస్ సరసన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే...

గ్లోబల్ బ్యూటీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె త్వరలో తెలుగు ఆడియెన్స్ ను పలకరించబోతోంది. ఇన్నాళ్లకు డైరెక్ట్ గా తెలుగు సినిమా చేయడం ఆ సినిమాపై అంచనాలను పెంచేసింది. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ Prabhas నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 Ad) చిత్రంతో తొలిసారిగా తెలుగు సినిమాలో నటించబోతోంది. అదికూడా డార్లింగ్ కు జోడీ నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 


నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదలైంది. దీపికాకు సంబంధించిన అప్డేట్స్ మాత్రం రాలేదు.

దీపికా పదుకొణె అభిమానులు కూడా ఈ చిత్రం నుంచి ఆమె ఫస్ట్ లుక్, తదితర అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. దీపికా ‘కల్కి’కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందనేది హాట్ టాపిక్ గ్గా మారింది. 

ప్రభాస్ - నాగ్ అశ్విన్ (Nag Ashwin) ప్రాజెక్ట్ కోసం దీపికా పదుకొణె రూ.20 కోట్ల వరకు ఛార్జ్ చేసిందని అంటున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హ్రుతిక్ రోషన్ సరసన నటించిన ‘ఫైటర్’ కోసం కూడా ఇంతే చార్జ్ చేసినట్టు తెలుస్తోంది. 

ఇక ‘కల్కి 2898 ఏడీ’ మాత్రం రూ.600 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ చూస్తే హాలీవుడ్ రేంజ్ కు ఏమాత్రం తగ్గడం లేదు. వైజయంతి బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

Latest Videos

click me!