మీనాక్షి చౌదరి సినిమాల లైనప్‌ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే.. మరో శ్రీలీల అవుతుందా?

Published : Mar 05, 2024, 05:30 PM IST

మీనాక్షి చౌదరి ఇండస్ట్రీలోకి వచ్చి మూడేళ్లు అవుతుంది. తొలి సినిమా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు అత్యంత బిజీ హీరోయిన్‌ అయిపోయింది. లేటెస్ట్ గా ఆమె కొత్త సినిమాల లైనప్‌ షాకిస్తుంది.   

PREV
17
మీనాక్షి చౌదరి సినిమాల లైనప్‌ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే.. మరో శ్రీలీల అవుతుందా?

టాలీవుడ్‌లో మరో బ్యూటీ సునామీలా దూసుకొస్తుంది. వరుస అవకాశాలను దక్కించుకుంటుంది. ఆమెనే మీనాక్షి చౌదరి. ఈ బ్యూటీ మూడేళ్ల క్రితం `ఇచట వాహనములు నిలుపరాదు` చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీ పెద్దగా పేరు తీసుకురాలేకపోయింది. ఆ తర్వాత రవితేజ సరసన నటించే అవకాశం వచ్చింది. మాస్‌ మహారాజాతో `ఖిలాడీ` మూవీ చేసింది. ఇందులో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా మెరిసింది. అయినా సినిమా హిట్‌ కాలేదు. 
 

27

ఈ క్రమంలో `హిట్‌` మూవీ చేసింది. `హిట్‌ 2`లో అడవి శేష్‌ సరసన నటించింది. కాస్త రొమాంటిక్‌ యాంగిల్‌ని ఓపెన్‌ చేసింది. బెడ్‌ సీన్లలోనూ రెచ్చిపోయింది. దీంతో అందరి దృష్టిలో పడింది. ఈ సినిమా మీనాక్షికి గుర్తింపు తెచ్చింది. దీంతో ఆమె పేరు టాలీవుడ్‌లో బాగా వినిపించింది. ఇటీవల మహేష్‌ బాబు సినిమాలో నటించింది. `గుంటూరు కారం`లో మహేష్‌కి మరదలు పాత్రలో నటించింది. కనిపించింది కాసేపే అయినా ఆమెకి మంచి పేరే వచ్చింది.  

37

ఈ నేపథ్యంలో మీనాక్షి క్రేజ్‌ పెరిగింది. ఆమెకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. యంగ్‌ హీరోల నుంచి స్టార్ హీరోల సినిమా ఛాన్స్ ల కూడా వస్తున్నాయి. దీంతో ఇప్పుడు బిజీ హీరోయిన్‌ అయిపోయింది మీనాక్షి. ఆమె వెంట అరడజనుకుపైగా సినిమాలుండటం విశేషం. నేడు మీనాక్షి చౌదరి పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె సినిమాలను ప్రటించారు మేకర్స్. అందులో భాగంగా ప్రస్తుతం ఆమె వరుణ్‌ తేజ్‌ `మట్క` సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. 

47

దీంతోపాటు మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న `విశ్వంభర`లో ఎంపికైంది. ఆమె సిస్టర్‌ రోల్‌ పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఐదుగురు భామల్లో ఒకరిగా మెరవబోతుందీ పొడుగుకాళ్ల సుందరి. అలాగే వెంకటేష్‌ సరసన కూడా ఎంపికైందట. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకీ ఓ మూవీ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా మీనాక్షినే ఎంచుకున్నట్టు తెలుస్తుంది. 

57

అలాగే దుల్కర్‌ సల్మాన్‌ సరసన `లక్కీ భాస్కర్‌`అనే సినిమా చేస్తుంది. దీనికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకోవైపు దళపతి విజయ్‌ సరసన `గోట్‌` మూవీలో నటిస్తుంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలాగే విజయ్‌తో తన 69 మూవీ, మరోవైపు విశ్వక్‌ సేన్‌తో ఓ సినిమా చేస్తుంది మీనాక్షి చౌదరి. ఇలా ఇప్పుడు మీనాక్షి చేతిలో ఏడు సినిమాలున్నాయి. 
 

67

ఇలా ఒకేసారి ఎక్కువ ఆఫర్లతో మొన్నటి వరకు టాలీవుడ్‌లో శ్రీలీల పేరు మారుమోగింది. అంతకు ముందు కృతి శెట్టి, పూజా హెగ్దేల పేర్లు ఇండస్ట్రీని ఊపేశాయి. ప్రారంభంలో హిట్ పడటంతో మేకర్స్ వారే కావాలంటున్నారు. హీరోలు సైతం వారిపైనే ఆసక్తి చూపించడంతో బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేయాల్సి వచ్చింది. తీరిక లేకుండా షూటింగ్‌ల్లో పాల్గొన్నారు ఈ అందాల భామలు. ఈ క్రమంలో తన పాత్ర ఎలా ఉంటుంది, సినిమా ఎలా వస్తుందనేది వారికి తెలియదు. ప్రారంభంలో ఆఫర్లు రావడమే గొప్ప. వచ్చిన ఆఫర్ల విషయంలో వెనకా ముందు చూసుకోకుండా చేస్తారు. తీరా ఆ సినిమాలు బోల్తా కొడుతుంటాయి. ఇటీవల శ్రీలీలకి అదే జరిగింది, అందుకు ముందు కృతి శెట్టి, అలాగే స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే విషయంలోనూ అలానే జరిగింది. ఇప్పుడు వీళ్లు ఖాళీ అయ్యారు. 
 

77

ఇప్పుడు మీనాక్షి చౌదరిని కూడా ఈ విషయం ఆందోళనకి గురి చేస్తుంది. శ్రీలీల, కృతి శెట్టిల పరిస్థితే తనకు ఎదురు అవుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి ఆమె అభిమానులకు. సోషల్‌ మీడియాలోనూ నెటిజన్లు అలాంటి కామెంట్లే చేస్తున్నారు. మీనాక్షి మరో శ్రీలీల అవుతుందా అని అంటున్నారు. `ధమాఖా`తో ఒక్కసారిగా పాపులర్‌ అయిన శ్రీలీలకి ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ వరుసగా బోల్తా కొట్టాయి. ఇప్పుడు ఒక్కటే ఆమె చేతిలో ఉంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories