పిల్లలతో కలిసి సినిమాలు చూడలేకపోతున్నాం.. జెనీలియా సంచలన వ్యాఖ్యలు..

Published : Jul 22, 2023, 01:21 PM IST

ప్రస్తుతం సినిమాల కంటెంట్ అందరూ కలిసి చూసేలా ఉండటంలేదు అంటుంది మాజీ హీరోయిన్ జెనిలీయా. ముఖ్యంగా పిల్లలతో కలిసి చూడలేకపోతున్నామంటూ కామెంట్లు చేసింది. ఇంతకీ ఆమె ఏమంటుందంటే..? 

PREV
18
పిల్లలతో కలిసి సినిమాలు చూడలేకపోతున్నాం.. జెనీలియా సంచలన వ్యాఖ్యలు..

హీరోయిన్లలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగి.. ఎక్స్ పోజింగ్ చేయకుండా సినిమాలు చేసిన వారిలో జెనిలీయా కూడా ఉన్నారు. ఆమె ఫ్యాషన్ డ్రస్ లువేసేది కాని..వల్గర్ గా మాత్రం కనిపించేది కాదు.. రొమాంటిక్ సీన్లు చేసేది కాని.. బెడ్ సీన్స్ అంటూ హాట్ హాట్ సీన్స్.. లిప్ లాక్స్ కు దూరంగా ఉండేది. 

28

ప్రస్తుత కాలంలో ఓటీటీలో వస్తున్న సినిమాలు కానీ వెబ్ సిరీస్ లో కానీ పిల్లలతో కలిసి చూసే విధంగా లేవని అంటుంది హీరోయిన్ జెనిలీయా. ఫ్యామిలీ అంతా కలిసి చూసేవిధంగాకంటెంట్ రావాల్సిన అవసరం ఉందన్నారు.  అందుకే కుటుంబం అంతా కలిసి చూసేలా ఉండే ట్రయల్‌ పీరియడ్‌ వెబ్ సిరీస్ తో  రాబోతున్నట్టు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారుజెనిలీయా. 
 

38

బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా ప్రేక్షకుల మనసు దోచుకుంది జెనిలీయా.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మంచి మంచి సినిమాలు చేసింది.  ఎంతో సక్సెస్ ఫుల్ లైఫ్ ను లీడ్ చేసిన ఈ బ్యూటీ.. బాలీవుడ్ నటుడు .. రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లాడి.. జీవితంలో  సెటిల్ అయ్యింది.

48

పెళ్లి తరువాత వెండితెరకు దూరం అయిన జెనిలియా.. వెంట వెంటనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి.. ఫ్యామిలీ లైఫ్ కే పరిమితం అయ్యింది.  కొంతకాలంగా  ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ.. పిల్లల ఆలనా పాలన చూసుకున్నా ఈ బ్యూటీ.. తిరిగి మూవీస్ లోకి ఎంట్రీ ఇవ్వడంకోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే ఎంట్రీ ఇచ్చేసింది కూడా 

58

జెనీలియా తన పేరుతో తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు నమోదు చేసుకుంది. తెలుగులో జెనీలియా బొమ్మరిల్లు, సై, రెడీ,ఢీ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి స్టార్ హీరోస్ సరసన స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ జెనీలియా స్టార్ హీరోల సరసన నటించిన ప్రతిసారి ఆమెకు నిరాశే ఎదురయ్యేది. హ్యాపీ, సాంబ, ఆరెంజ్ చిత్రాలే అందుకు ఉదాహరణ. బొమ్మరిల్లు చిత్రంలో హాసినిగా జెనీలియా నటనని ఎప్పటికి మరిచిపోలేం. 

68
Image: Genelia D'Souza.Instagram

ఈ క్రమంలోనే పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఆడియన్స్ ను అలరించడానికి  సిద్ధమయ్యారు జెనిలీయా.ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు పలు వెబ్ సిరీస్ ల ద్వారా రీ ఎంట్రీలు ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జెనీలియా కూడా ట్రయల్ పీరియడ్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. 

78

ఈ వెబ్ సిరీస్ జులై 21 నుంచి ఓటీటీ జియో సినిమా వేదికగా స్ర్టీమింగ్‌ కానుంది.ఈ సందర్భంగా జెనీలియా మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు. సాధారణంగా నేను ఏదైనా ఒక సినిమాకు కమిట్ అవ్వాలంటే కథ చదవటానికి చాలా సమయం తీసుకుంటాను కానీ ఈ వెబ్ సిరీస్ కేవలం గంటలోనే చదివేసి ఓకే చెప్పానని తెలిపారు. 
 

88

తన రీ ఎంట్రీ ఇలాంటి ఒక అద్భుతమైన కథతో రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇందులో తాను ఒంటరి మహిళగా కనిపిస్తానని అయితే ఈ సిరీస్ కుటుంబం మొత్తం కలిసి చూసేలాగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఓటీటీలో ఇంట్లో అంతా కలిసి చేసే కంటెంట్ చాలాతక్కువగా ఉంటుందని. తాను మాత్రంమంచి సినిమాలు చేసేలా ప్రణాళిక చేసుకుంటున్నా అన్నారు. ఈ సందర్భంగా జెనీలియా ఓటీటీల గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

click me!

Recommended Stories