ఆ డైరెక్టర్ లా చెడగొడితే కష్టం, దేవుళ్ళని కరెక్ట్ గా వాడితే కాసుల పంటే..చిరు, విష్ణు, నిఖిల్ అందరిదీ అదే దారి

First Published | Jan 20, 2024, 11:03 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో నయా ట్రెండ్ మొదలయింది. ఎప్పుడో ఏఎన్నార్, ఎన్టీఆర్ సమయంలో పౌరాణిక చిత్రాల హవా కొనసాగింది. కానీ ఆ తర్వాత 80, 90 దశకాల్లో పౌరాణిక చిత్రాలకు బ్రేకులు పడ్డాయి. దేవుళ్ళ నేపథ్యంలోవచ్చిన చిత్రాలు కూడా తక్కువే.

ప్రస్తుతం టాలీవుడ్ లో నయా ట్రెండ్ మొదలయింది. ఎప్పుడో ఏఎన్నార్, ఎన్టీఆర్ సమయంలో పౌరాణిక చిత్రాల హవా కొనసాగింది. కానీ ఆ తర్వాత 80, 90 దశకాల్లో పౌరాణిక చిత్రాలకు బ్రేకులు పడ్డాయి. దేవుళ్ళ నేపథ్యంలోవచ్చిన చిత్రాలు కూడా తక్కువే. తిరిగి ఇప్పుడు హిందూ దేవుళ్ళ నేపథ్యంలో సినిమాలు పెరుగుతున్నాయి. 

చూస్తుంటే హిందూ దేవుళ్లతో సినిమాలు చేయడం హిట్ ఫార్ముల అయిపోయింది. దేవుళ్ళ ఇమేజ్ ని కరెక్ట్ గా వాడుకుని దానిని పౌరాణిక గాధలతో మిక్స్ చేసి సినిమాలు చేస్తే బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురుస్తోంది. అందుకు చక్కటి ఉదాహరణ కార్తికేయ 2, రీసెంట్ గా వచ్చిన హను మాన్. 


కార్తికేయ 2: కార్తికేయ 2 చిత్రాన్ని డైరెక్టర్ చందు ముండేటి శ్రీకృష్ణుడి నేపథ్యంలో తెరకెక్కించారు. కార్తికేయ 2 చిత్రం అంతా బాగానే ఉంది కానీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలవడానికి కారణం మాత్రం క్లైమాక్స్ లో అనుపమ్ ఖేర్ శ్రీకృష్ణుడి గొప్పతననాన్ని వర్ణించే ఎపిసోడ్ అంటూ చాలా మంది అభిప్రాయ పడ్డారు. ఐదు నిమిషాల పాటు కృషుడి గురించి వర్ణిస్తూ గూస్ బంప్స్ తెప్పించారు. ఆ ఒక్క సీన్ తో సినిమా స్వరూపమే మారిపోయింది. 

హను మాన్ : ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన హనుమాన్ చిత్రం ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. హను మాన్ చిత్రం కూడా రొటీన్ స్టోరీనే అని చెప్పాలి. కానీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆంజనేయ స్వామిని ఎక్కడ ఎలా ఉపయోగించాలో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు. సూపర్ హీరో కథని, ఆంజనేయ స్వామిని, మైథాలజీని సరిగ్గా మిస్క్ చేసి అనేక గూస్ బంప్స్ మూమెంట్స్ అందించారు. అక్కడే మ్యాజిక్ జరిగింది. 

విశ్వంభర :కార్తికేయ 2, హను మాన్ బాటలోనే మెగాస్టార్ చిరంజీవి  నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. బింబిసార డైరెక్టర్ వశిష్ఠ పెద్ద ప్లాన్ తోనే వస్తున్నాడు. జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో దైవత్వం కలగలిపిన ఫిక్షనల్ ఫాంటసీ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ లో భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎంతో పవర్ ఫుల్ గా చూపించారు. దీనితో మెగా అభిమానులు ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఆదిపురుష్ డైరెక్టర్ లాగా చెడగొట్టకుండా దేవుళ్ళని సరిగ్గా వాడుకుంటే కాసులు కురుస్తాయి అని ఫ్యాన్స్ అంటున్నారు. 

కన్నప్ప : మంచు విష్ణు కూడా మైథలాజి బ్యాక్ డ్రాప్ లోనే భారీ ప్రయత్నం చేస్తున్నాడు. పరమ శివుడికి పరమ భక్తుడైన కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 100 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మహాభారతం లాంటి టివి సిరీస్ తెరకెక్కించిన అనుభవజ్ఞుడైన దర్శకుడు ముకేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

ఈ ప్రయత్నాలన్నీ విజయవంతం అయితే ఇక టాలీవుడ్ లో దేవుళ్ళ బ్యాక్ డ్రాప్ లో మరిన్ని చిత్రాలు రావడం ఖాయం. ఇప్పటికే ప్రశాంత్ వర్మ సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో మైథలాజి మిక్స్ చేసి సినిమాటిక్ యూనివర్స్ ని సిద్ధం చేస్తున్నారు. కార్తికేయ 3 కూడా కృష్ణుడి బ్యాక్ డ్రాప్ లోనే ఉండబోతోంది. 

Latest Videos

click me!