డైరెక్టర్లని గుడ్డిగా నమ్మేసిన మహేష్, బాలయ్య, ప్రభాస్, ఎన్టీఆర్.. దారుణమైన రిజల్ట్, వాళ్ళిద్దరి కష్టం మాత్రం

Published : Jul 15, 2024, 10:08 AM IST

దర్శకుల ట్రాక్ రికార్డ్ దృష్టిలో పెట్టుకుని కొందరు హీరోలు వారిని నమ్మేస్తుంటారు. కథని పెద్దగా పట్టించుకోరు. స్టోరీ అటు ఇటుగా ఉన్నా టేకింగ్ తో మేనేజ్ చేస్తారు అని దర్శకులని నమ్మేస్తారు.

PREV
18
డైరెక్టర్లని గుడ్డిగా నమ్మేసిన మహేష్, బాలయ్య, ప్రభాస్, ఎన్టీఆర్.. దారుణమైన రిజల్ట్, వాళ్ళిద్దరి కష్టం మాత్రం

దర్శకుల ట్రాక్ రికార్డ్ దృష్టిలో పెట్టుకుని కొందరు హీరోలు వారిని నమ్మేస్తుంటారు. కథని పెద్దగా పట్టించుకోరు. స్టోరీ అటు ఇటుగా ఉన్నా టేకింగ్ తో మేనేజ్ చేస్తారు అని దర్శకులని నమ్మేస్తారు. ఆవిధంగా నమ్మడం వల్ల టాలీవుడ్ స్టార్ హీరోలు కొందరు దారుణమైన ఫ్లాపులు మూటగట్టుకున్నారు. 

28

ఎన్టీఆర్ - దమ్ము : అప్పటి బోయపాటి శ్రీను భద్ర, తులసి, సింహా లాంటి మూడు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో మంచి జోరుమీద ఉన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కి వెళ్లి దమ్ము కథ చెప్పారు. కథ వినగానే తాను బోయపాటిని ఎగిరి కౌగిలించుకున్నానని ఎన్టీఆర్ దమ్ము రిలీజ్ ముందు చెప్పారు. అంతలా ఎన్టీఆర్ బోయపాటిని నమ్మేశారు. కానీ దమ్ము రిజల్ట్ పూర్తిగా బెడిసికొట్టింది. 

38

విజయ్ దేవరకొండ - లైగర్ : ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పూరి జగన్నాధ్ కి విజయ్ దేవరకొండ గ్ర్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చాలా మంది హీరోల కెరీర్ ని మలుపు తిప్పింది పూరీనే. తనకి కూడా మాస్ ఇమేజ్ తీసుకువస్తారని విజయ్ దేవరకొండ లైగర్ చిత్రం కోసం ఒళ్ళు హూనం చేసుకునేలా కష్టపడ్డాడు. నత్తిగా మాట్లాడుతూ డైలాగ్స్ ట్రై చేశాడు. ఏదీ వర్కౌట్ కాలేదు. కట్ చేస్తే పూరి, విజయ్ కెరీర్ లోనే లైగర్ బిగ్గెస్ట్ డిజాస్టర్. 

48

ప్రభాస్ - ఆదిపురుష్ : పౌరాణిక చిత్రాలని అద్భుతంగా తెరకెక్కించిన ట్రాక్ రికార్డ్ నార్త్ డైరెక్టర్లకి లేదు. అయినప్పటికీ ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంపై నమ్మకం ఉంచారు. నిర్మాతలు 600 కోట్ల బడ్జెట్ వెచ్చించారు. రామాయణాన్ని రామాయణంలా కాకుండా ఇంకేదో ట్రై చేసిన ఓం రౌత్ కి పరాభావం తప్పలేదు. 

58

బాలకృష్ణ- ఒక్క మగాడు : దేవదాసు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య లాంటి సూపర్ హిట్ చిత్రాలతో వైవిఎస్ చౌదరి తిరుగులేకుండా దూసుకుపోతున్నారు. పైగా నందమూరి ఫ్యామిలీకి వీరాభిమాని. దీనితో కథ కూడా వినకుండా బాలయ్య ఈ చిత్రాన్ని ఓకె చేశారు. భారతీయుడిలా ప్రయత్నించిన వైవిఎస్ చౌదరి సిల్లీ సన్నివేశాలతో విమర్శలు ఎదుర్కొన్నారు. ఒక్క మగాడు దారుణ పరాజయం చవిచూసింది. 

68

రాంచరణ్ - వినయ విధేయ రామ : బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ తో ఒక సినిమా చేయాలని రాంచరణ్ ఈ చిత్రానికి కమిటయ్యారు. కానీ వినయ విధేయ రామ చిత్రం వర్కౌట్ కాలేదు. కొన్ని సీన్లు అయితే ట్రోలింగ్ కి గురయ్యాయి. 

 

78

మహేష్ బాబు - 1 నేనొక్కడినే : సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లోనే బాగా శ్రమించిన చిత్రం 1 నేనొక్కడినే. సుకుమార్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీసుకున్నారు. మహేష్, సుకుమార్ తో పటు టీమ్ మొత్తం ఎంతగానో కష్టపడ్డారు. కానీ ఈ చిత్ర కథ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. దీనితో మహేష్ కాష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయింది. 

88

అల్లు అర్జున్ - బద్రీనాథ్ : మగధీర తరహాలో భారీ చిత్రం చేయాలని అల్లు అర్జున్.. వివి వినాయక్ దర్శకత్వంలో బద్రీనాథ్ చిత్రం చేశారు. బన్నీ ఈ చిత్రం కోసం కొత్త గెటప్ ట్రై చేశాడు. బాడీ లాంగ్వేజ్ కూడా మార్చి బాగా కష్టపడ్డాడు. కానీ ఫలితం దక్కలేదు. 

 

Read more Photos on
click me!

Recommended Stories