తెలుగు బుల్లితెర మీద చెరగని ముద్ర వేసింది. ఆమెను ట్రెండ్ సెట్టర్ అంటారు. తెలుగు యాంకరింగ్ కి గ్లామర్ యాంగిల్ పరిచయం చేసింది అనసూయ. జబర్దస్త్ వేదికగా ఆమె చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. అనసూయ అందాల కోసమే జబర్దస్త్ చూసే ఆడియన్స్ ఉండేవారంటే అతిశయోక్తి కాదు.
27
అనసూయ అనతికాలంలో ఫేమ్ రాబట్టడానికి పొట్టిబట్టల్లో గ్లామర్ షో చేయడం ఒక కారణం. అలాగే జబర్దస్త్ ట్రెమండస్ సక్సెస్ కావడం కూడా ఆమె కెరీర్ కి ప్లస్ అయ్యింది. అనసూయ ఎంత పాపులారిటీ తెచ్చుకుందో అదే స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. కుటుంబ సభ్యులు అందరూ కూర్చుని వీక్షించే షోల్లో స్కిన్ షో చేయడం సరికాదని సాంప్రదాయవాదుల వాదన.
37
అయితే సదరు విమర్శలు అనసూయ ఎన్నడూ లెక్కచేయలేదు. అది తన వృత్తిలో భాగమని సమర్థించుకుంది. అదే సమయంలో విమర్శించిన వాళ్లకు తనదైన శైలిలో సమాధానం చెప్పింది. నా బట్టలు నా ఇష్టం. నాకు కంఫర్ట్ అనిపిస్తే ఎలాంటి దుస్తులు అయినా ధరిస్తాను. అయినా నా డ్రెస్సింగ్ ఎలా ఉండాలో నిర్ణయించడానికి మీరెవరు అంటుంది. ఇదే యాటిట్యూడ్ అనసూయ కొనసాగిస్తోంది..
47
Anasuya Bharadwaj Hot Photos
కాగా ఓ రెండేళ్లు అనసూయ బుల్లితెరకు దూరమైంది. 2022లో జబర్దస్త్ నుండి తప్పుకున్న అనసూయ.. మిగతా షోలకు కూడా గుడ్ బై చెప్పింది. పూర్తిగా బుల్లితెరపై కనిపించడం మానేసింది. నటిగా ఆమెకు వరుస ఆఫర్స్ రావడం ఇందుకు కారణం. ఇకపై బుల్లితెర షోలు చేసేది లేదని పరోక్షంగా చెప్పిన అనసూయ... అనూహ్యంగా రీ ఎంట్రీ ఇచ్చింది.
57
స్టార్ మాలో ఇటీవల మొదలైన కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షో జడ్జిగా ఆమె వ్యవహరిస్తున్నారు. బుల్లితెర సెలెబ్స్ అమ్మాయిలు, అబ్బాయిలుగా విడిపోయి ఈ గేమ్ షోలో పాల్గొంటున్నారు. అమ్మాయిలకు లీడర్ గా అనసూయ, అబ్బాయిలకు శేఖర్ మాస్టర్ వ్యవహరిస్తున్నారు. లాంచింగ్ ఎపిసోడ్ లో నెట్ డ్రెస్ వేసుకొని వచ్చి జాకెట్ తీసేసి రచ్చ చేసింది అనసూయ.
67
అనసూయ కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో మితిమీరిన గ్లామర్ షోకి పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనసూయ ఈజ్ బ్యాక్. జబర్దస్త్ రోజులను తలపిస్తుందని సోషల్ మీడియా టాక్. ఎపిసోడ్ ఎపిసోడ్ కి ఆమె స్కిన్ షో డోస్ ఎక్కువ అవుతుంది. దీనిపై విమర్శలు వచ్చినా.. ఐ డోంట్ కేర్ అంటుంది. ఎవరేమంటే నాకేంటని అందాల విందుకు తెరలేపుతుంది.
77
కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ లాంచింగ్ ఎపిసోడ్ లో అనసూయ జాకెట్ విప్పేసి బాయ్స్ కి ఛాలెంజ్ విసరడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. విమర్శలు తలెత్తాయి. అనసూయ తనదైన శైలిలో సదరు విమర్శలు తిప్పికొట్టింది. సాంప్రదాయ వాదులు ఎంత గగ్గోలు పెట్టినా అనసూయ వినదు. విమర్శలు చేసే కొద్దీ మరింత రెచ్చిపోవడం అనసూయ వీక్నెస్. సోషల్ మీడియాలో ఆమె ఇదే చేస్తుంది. తనని ఏ కోణంలో హేటర్స్ ట్రోల్ చేస్తారో... అదే పని చేసి వాళ్ళను కవ్విస్తుంది. ఓ సెక్షన్ మాత్రం అనసూయ గ్లామర్ ట్రీట్ ఎంజాయ్ చేస్తున్నారు..