డేంజర్ జోన్ లో ఉన్న టాలీవుడ్ హీరోలు, ఒకరిని మించేలా మరొకరు ఫ్లాప్ చిత్రాలతో పోటీ..

ప్రస్తుతం టాలీవుడ్ లో కొందరు హీరోలు డేంజర్ జోన్ లో ఉన్నారు. వెంటనే జాగ్రత్త పడకుంటే వాళ్ళ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

Tollywood Heroes in danger zone with flop movies in telugu dtr
Nithiin, Ram Pothineni, Gopichand

ప్రస్తుతం టాలీవుడ్ లో కొందరు హీరోలు డేంజర్ జోన్ లో ఉన్నారు. వెంటనే జాగ్రత్త పడకుంటే వాళ్ళ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. నితిన్, గోపీచంద్, వరుణ్ తేజ్ లాంటి హీరోలు ఒకరిని మించేలా మరొకరు ఫ్లాప్ చిత్రాలతో పోటీ పడుతున్నారు. 

Tollywood Heroes in danger zone with flop movies in telugu dtr

నితిన్ కి డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపులు 

యంగ్ హీరో నితిన్ కి భీష్మ తర్వాత డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపులు ఎదురయ్యాయి. చెక్, రంగ్ దే, మ్యాస్ట్రో (ఓటీటీ), మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలతో పాటు రీసెంట్ గా విడుదలైన రాబిన్ హుడ్ కూడా డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. ఇకపై కూడా ఫ్లాపులు ఎదురైతే నితిన్ మార్కెట్ పడిపోయి కెరీర్ ప్రమాదంలో పడొచ్చు.  


అఖిల్ : అయ్యగారికి ఇంతవరకు హిట్టే లేదు 

అక్కినేని వారసుడు అయ్యగారు ఇంత వరకు విజయాల ఖాతా ఓపెన్ చేయనే లేదు. అఖిల్ 2015లో అఖిల్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, చివరగా నటించిన ఏజెంట్ చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. త్వరలో అఖిల్ చిత్తూరు బాక్  డ్రాప్ లో ఒక చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. 

గోపీచంద్ : పదేళ్లలో ఒక్క హిట్ కూడా లేదు 

హీరో గోపీచంద్ పరిస్థితి దారుణంగా ఉంది. గత పదేళ్లలో గోపీచంద్ కి ఒక్క హిట్ కూడా లేదు. మధ్యలో గౌతమ్ నందా చిత్రం యావరేజ్ గా నిలిచింది అంతే. ఇటీవల గోపీచంద్ నటించిన విశ్వం, రామబాణం, భీమా చిత్రాలు దారుణమైన డిజాస్టర్ కేటగిరీలోకి వెళ్లిపోయాయి. ఇది గోపీచంద్ కెరీర్ కి డూ ఆర్ డై సిట్యువేషన్ గా మారింది. గోపీచంద్ తదుపరి చిత్రం ఘాజి ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇంపాక్ట్ చూపలేకపోతున్న శర్వానంద్ 

యువతలో మంచి క్రేజ్ ఉన్న శర్వానంద్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ ఇంపాక్ట్ చూపించే చిత్రం ఇటీవల కాలంలో ఒక్కటి కూడా లేదు. శర్వా నటించిన చివరి చిత్రం మనమే బిగ్ డిజాస్టర్ గా నిలిచింది. 

Varun Tej

ప్రయోగాలతో చేతులు కాల్చుకున్న మెగా ప్రిన్స్ 

వరుణ్ తేజ్ : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చివరగా నటించిన గని, గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా చిత్రాలు ఊహించని డిజాస్టర్స్ గా నిలిచాయి. దీనితో వరుణ్ తేజ్ ఇకపై ప్రయోగాల జోలికి పోకుండా ప్రేక్షకులు ఎంటర్టైన్ అయ్యే కథలు చేయాలని డిసైడ్ అయ్యాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రస్తుతం ఒక హర్రర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. 

Ram Pothineni

రామ్ పోతినేని : క్రేజ్ ఉంది కానీ..

రామ్ పోతినేనికి ఎనెర్జిటిక్ స్టార్ గా యువతలో మంచి గుర్తింపు ఉంది. కానీ రామ్ పోతినేని నటిస్తున్న చిత్రాలు వర్కౌట్ కావడం లేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ కి సరైన హిట్ లేదు. ప్రస్తుతం రామ్ పోతినేని మహేష్ పి. దర్శకత్వంలో నటిస్తున్నారు. 

Latest Videos

vuukle one pixel image
click me!