ఈ ఏడాది చాలా మంది టాలీవుడ్ దర్శకులు మంచి హిట్ కొట్టాలి అని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. గత ఏడాది అంతకు ముందు ఎదురైన పరాజయాలకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తున్నారు. వారిలో పూరి జగన్నాధ్, కొరటాల శివ, సుజీత్ లాంటి క్రేజీ డైరెక్టర్లు ఉన్నారు. ఇంకా చాలా మందే ఉన్నప్పటికీ అభిమానుల చూపు ఈ ముగ్గురు డైరెక్టర్లపై ఎక్కువగా ఉంది.