తెలుగు వారంతా గర్వపడే విధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది.దేశంలో రెండవ అత్యున్నత పురస్కారం ఇది. తెలుగు సినీ రంగంలో విశేషమైన ప్రతిభ కనబరుస్తూ సేవలందిస్తున్న చిరంజీవికి తగిన గౌరవం ఇది.
దీనితో సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి.. అభిమానుల నుంచి చిరంజీవికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ నుంచి హీరోలు, నిర్మాతలు
చిరంజీవికి 2006లోనే పద్మభూషణ్ అవార్డు వరించింది. అయితే నేడు రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రెండవ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది.
ఈ సందర్భంగా చిరంజీవి నివాసానికి సెలెబ్రిటీల తాకిడి మొదలయింది. నిర్మాతలు, మంత్రులు, హీరోలు చిరంజీవిని కలసి పద్మ విభూషణ్ అవార్డు దక్కినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో కలసి దిల్ రాజు చిరంజీవి నివాసానికి వెళ్లారు. చిరంజీవిని ఆప్యాయంగా పలకరించి అభినందనలు తెలిపారు.
మైత్రి మూవీస్ సంస్థ నీరంతా రవిశంకర్, దర్శకుడు బుచ్చిబాబు కూడా చిరు ఇంటికి వెళ్లారు. ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య, బేబీ నిర్మాత ఎస్ కె ఎన్, డైరెక్టర్ మారుతి కూడా చిరంజీవిని కలసి శుభాకాంక్షలు తెలిపారు.
ఇక మెగా హీరో సాయిధరమ్ తేజ్ మావయ్యని కలసి శుభాకాంక్షలు తెలపడమే కాదు ఆశీస్సులు కూడా తీసుకున్నారు. గాడ్ ఫాదర్ చిత్రంలో కీలక పాత్రలో నటించిన హీరో సత్య దేవ్ కూడా చిరంజీవిని కలసి శుభాకాంక్షలు తెలిపారు.