బిగ్ బాస్ 8 హోస్ట్ గా నాగార్జున డ్రాప్ అయితే.. ఆ సత్తా ఉన్న హీరోలు ఎవరెవరు ?

First Published Jun 12, 2024, 8:06 PM IST

గత ఐదు సీజన్ల నుంచి నాగార్జున బిగ్ బాస్ కి హోస్ట్ గా చేస్తున్నారు. ఒక వేళ ఈ సీజన్ లో హోస్ట్ మార్పు ఏమైనా ఉంటుందా ? సీజన్ లో కాకపోయినా తర్వాత సీజన్స్ కి అయినా నాగార్జున డ్రాప్ అవుతారా ? ఒక వేళ అది జరిగితే నాగార్జునలాగా బిగ్ బాస్ ని విజయవంతంగా నడిపించగలిగే సత్తా ఉన్న హీరోలు ఎవరు అంటూ చర్చ మొదలైంది. 

Bigg Boss Telugu 8

3వ సీజన్ నుంచి కింగ్ నాగార్జున బిగ్ బాస్ తెలుగు షోకి హోస్ట్ గా చేస్తున్నారు. ఇప్పటికి 7 సీజన్లు పూర్తయ్యాయి. 8 వ సీజన్ కి సన్నాహకాలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ సక్సెస్ అయింది. అంతకు ముందు కొన్ని సీజన్స్ పై విమర్శలు వచ్చినప్పటికీ సీజన్ 7 మాత్రం మంచి వినోదాన్ని అందించి విజయవంతంగా ముగిసింది. ఇక సీజన్8పై ఎవరి అంచనాలు వాళ్ళకి ఉన్నాయి. 

నాగార్జున బిగ్ బాస్ షోని హోస్ట్ గా నడిపించే విధానం అద్భుతం అనే చెప్పొచ్చు. నాగార్జున వాక్ చాతుర్యం, సమయస్ఫూర్తి ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. హోస్ట్ గా చేసే వారికి ఈ లక్షణాలు తప్పనిసరి. అవసరం అయినప్పుడు కోపం ప్రదర్శించడం, జోకులు సెటైర్లు వేయడం ఇలాంటి షోలకు అవసరం. నాగార్జున అందులో పర్ఫెక్ట్ అనే చెప్పొచ్చు. 

గత ఐదు సీజన్ల నుంచి నాగార్జున బిగ్ బాస్ కి హోస్ట్ గా చేస్తున్నారు. ఒక వేళ ఈ సీజన్ లో హోస్ట్ మార్పు ఏమైనా ఉంటుందా ? సీజన్ లో కాకపోయినా తర్వాత సీజన్స్ కి అయినా నాగార్జున డ్రాప్ అవుతారా ? ఒక వేళ అది జరిగితే నాగార్జునలాగా బిగ్ బాస్ ని విజయవంతంగా నడిపించగలిగే సత్తా ఉన్న హీరోలు ఎవరు అంటూ చర్చ మొదలైంది. 

Rana Daggubati

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలి సీజన్ కి హోస్ట్ గా చేశారు. ఆ సీజన్ సూపర్ సక్సెస్ అయింది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానిని దింపారు. నాని కూడా వినోదాత్మకంగా బిగ్ బాస్ ని నడిపించారు. ఆ తర్వాత నాగార్జున కొనసాగుతున్నారు. నాగార్జున కనుక డ్రాప్ అయితే అభిమానుల్లో ముందుగా వినిపిస్తున్న పేరు నందమూరి బాలకృష్ణ. 

బాలయ్య లాంటి మాస్ యాటిట్యూడ్ ఉన్న నటుడు బుల్లితెరపై ఇలాంటి షోలని నడిపించగలరా అనే డౌట్ ఉండేది. అన్ స్టాపబుల్ షోతో బాలయ్య ఆ అనుమానాల్ని చెల్లాచెదురు చేసేశారు. అన్ స్టాపబుల్ షోకి బాలయ్య హోస్ట్ కావడం వల్ల మామూలు క్రేజ్ రాలేదు. బాలయ్య ఎనర్జీ, చలాకీతనం అందరిని భలే ఆకట్టుకున్నాయి. సో బిగ్ బాస్ షోకి బాలయ్య పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు అని చెప్పడం లో సందేహం లేదు. బాలయ్య స్టైల్ లో చెప్పాలంటే దబిడ దిబిడే. 

Vijay Devarakonda

గతంలో విజయ్ దేవరకొండ గురించి కూడా రూమర్స్ వచ్చాయి. బిగ్ బాస్ షోకి హోస్ట్ గా చేసేందుకు విజయ్ దేవరకొండతో చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలు నిజం కాలేదు. కానీ విజయ్ దేవరకొండలో బిగ్ బాస్ షోని నడిపించగలిగే లక్షణాలు ఉన్నాయి. 

అదే విధంగా రానా దగ్గుబాటి.. గతంలో భల్లాల దేవుడు నంబర్ 1 యారీ అనే షోకి హోస్ట్ గా చేసారు. రానాకి మంచి కామెడీ టైమింగ్, వాక్చాతుర్యం ఉన్నాయి. రానా కూడా బిగ్ బాస్ హోస్ట్ గా సరిపోతారని అంటున్నారు. 

ఒక వేళ హీరోయిన్లతో ప్రయోగం చేయాలి అనుకుంటే ముందుగా వినిపిస్తున్న పేరు సమంత. గతంలో సమంత కొన్ని షోలకు హోస్ట్ గా చేసింది. బిగ్ బాస్ లో కూడా ఒక ఎపిసోడ్ లో సరదాగా హోస్ట్ గా చేసింది. సమంత గ్లామర్, ఆమె క్రేజ్ బిగ్ బాస్ షోకి బాగా ఉపయోగపడతాయి అని చెప్పడంలో సందేహం లేదు. 

Latest Videos

click me!