శర్వానంద్‌కి మరో ఫ్లాప్‌.. ఆ డైరెక్టర్‌ తన కొడుకుని ప్రమోట్ చేయడం కోసం శర్వాని వాడుకున్నాడా?

First Published Jun 12, 2024, 7:08 PM IST

శర్వానంద్‌కి హిట్‌ పడి ఏడేళ్లు అవుతుంది. తాజాగా ఆయన `మనమే` అనే సినిమాతో వచ్చాడు, మరో ఫ్లాప్‌ని మూటగట్టుకున్నాడు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 

యంగ్‌ హీరో శర్వానంద్‌ ఇండస్ట్రీలోకి వచ్చి 20ఏళ్లు అవుతుంది. చిన్న చిన్న పాత్రలతో ఆయన మెరుస్తూ హీరోగా మారాడు. నిజానికి తొలి చిత్రం `ఐదో తారీఖు` సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు శర్వా. ఆ సినిమా ఆడలేదు. దీంతో `గౌరీ`, `శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌`, `యువసేన`, `సంక్రాంతి`, `వెన్నెల`, `లక్ష్మి` చిత్రాల్లో సైడ్‌ రోల్స్ చేశాడు. కొన్ని కీలక పాత్రల్లో మెరిశాడు. `అమ్మ చెప్పింది`మూవీతో హీరోగా టర్న్ తీసుకున్నాడు. `గమ్యం` సినిమా శర్వాకి బ్రేక్‌ ఇచ్చింది. ఈ మూవీ పెద్ద విజయం సాధించిది. దీంతో సోలో హీరోగా మారిపోయాడు శర్వానంద్‌. `ప్రస్థానం` చిత్రంతో మరో పెద్ద హిట్‌ అందుకున్నాడు. `రన్‌ రాజా రన్‌` సినిమా హిట్‌తో స్టార్‌ అయిపోయాడు. కమర్షియల్‌ విజయాన్ని అందుకున్నాడు. అనంతరం `మళ్లీ మళ్లీ ఇది రాని రోజు` సినిమా క్రిటికల్‌గా ప్రశంసలు అందించింది. కమర్షియల్‌గానూ ఫర్వాలేదనిపించింది. 
 

`ఎక్స్ ప్రెస్‌ రాజా`, `మహానుభావుడు` పెద్ద హిట్‌ అయ్యాయి. కెరీర్‌ పరంగా శర్వానంద్‌ హీరోగా నిలబడిపోయాడని, ఇక తిరుగులేదని భావించారు. కానీ అనంతరం వరుసగా పరాజయాలు వెంటాడాయి శర్వాని. `రాధా`, `పడి పడి లేచే మనసు`, `రణరంగం`, `జాను`, `శ్రీకారం`, `మహాసముద్రం`, `ఆడువాళ్లు మీకు జోహార్లు` ఇలా వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. రెండేళ్ల క్రితం వచ్చిన `ఒకే ఒక జీవితం` క్రిటికల్‌గా ఆకట్టుకుంది. ఎమోషనల్‌ మూవీగా మెప్పించింది. కమర్షియల్‌ అంతగా ప్రభావం చూపలేకపోయింది. 
 

ఈ క్రమంలో కొంత గ్యాప్‌ తీసుకుని వచ్చాడు శర్వానంద్‌. ఇటీవల ఆయన శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో `మనమే` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ థియేటర్లలో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. డిజాస్టర్‌ దిశగా వెళ్తుంది. సినిమాని చూసేందుకు ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు, పైగా సినిమాలో కొత్త కంటెంట్‌ లేకపోవడంతో ఎవరూ పట్టించుకోవడం లేదు. 
 

దీంతో శర్వానంద్‌కి మరో ఫ్లాప్‌ పడిందని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా విషయంలో ఓ విమర్శ చాలా వినిపిస్తుంది. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తన కొడుకు(విక్రమ్‌ ఆదిత్య) కోసం సినిమా తీశాడా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. సినిమాలో కొడుకు విక్రమ్‌ని చూపించడంలో పెట్టిన శ్రద్ధ కంటెంట్‌ మీద పెట్టలేదని కామెంట్‌ చేస్తున్నారు. దర్శకుడు కొడుకుని ప్రమోట్‌ చేయడం కోసం శర్వాని వాడుకున్నాడనే విమర్శలు చేస్తున్నారు.  

`మనమే` మూవీ కొడుకు చుట్టూ కథ తిరుగుతుంది. హీరో శర్వానంద్‌ ఫ్రెండ్‌ అరుణ్‌ ఆదిత్‌(త్రిగుణ్‌), తన భార్య పాత్ర ఓ ప్రమాదంలో మరణిస్తారు. వీరికి కొడుకు ఉంటాడు. అతను అనాథ అవుతారు. వీరు లండన్‌లో ఉంటారు. అక్కడి రూల్స్ ప్రకారం కేర్‌ టేకర్‌ ఇంట్లోనే పిల్లాడు ఉండాలి, లేదంటే ఆశ్రమంలో వేస్తారు. ప్రభుత్వమే కేర్‌ తీసుకుంటుంది. అలా కాదని, ఫ్రెండ్‌ కోసం శర్వా, అలాగే అరుణ్‌ భార్య పాత్ర ఫ్రెండ్‌ అయిన కృతి శెట్టి కలిసి ఒకే ఇంట్లో ఉంటూ ఆ కుర్రాడిని కేర్‌ టేకర్స్‌ గా వ్యవహరిస్తారు. ఆ చిన్నారిని పెంచడం కోసం ఈ ఇద్దరు ఎలా గొడవపడ్డారు, ఎలా ప్రేమలో పడ్డారు, చివరికి ఏమైందనేది సినిమా. మూవీ మొత్తం ఆ చిన్నారి పాత్ర చుట్టూతే తిరుగుతుంది. ఇంకా చెప్పాలంటే హీరోహీరోయిన్ల కంటే ఆ చిన్నోడే ఎక్కువ హైలైట్‌ కావడం విశేషం. 
 

అందుకే ఆడియెన్స్ ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. ఎవరి అభిప్రాయం ఏదైనా శర్వానంద్‌కి మరో డిజాస్టర్‌ పడింది. దాదాపు ఏడేళ్లుగా ఆయనకు హిట్‌ లేకపోవడం విచారకరం. ఇటీవలే శర్వానంద్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. సినిమాల విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. అయినా నిరాశ తప్పడం లేదు. మరి మున్ముందైనా ఆయన మంచి ప్రాజెక్ట్స్ తో రావాలని, బౌన్స్ బ్యాక్‌ కావాలని కోరుకుందాం. 
 

Latest Videos

click me!