బావా మనం కూడా చేసుకుందాం, షూటింగ్ అయ్యాక కలువు... పెళ్ళైన యాంకర్ కోరిక తీరుస్తానన్న సుడిగాలి సుధీర్!

First Published Jun 12, 2024, 6:48 PM IST

యాంకర్ స్రవంతి చొకారపు పచ్చిగా ఓ కోరిక బయటపెట్టింది. సరే షూటింగ్ అయ్యాక కలువు అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు ప్లే బాయ్ సుడిగాలి సుధీర్. స్రవంతి-సుడిగాలి సుధీర్ మధ్య చోటు చేసుకున్న డబుల్ మీనింగ్ సంభాషణ మైండ్ బ్లాక్ చేసింది. 
 

సుడిగాలి సుధీర్ యాంకర్ గా బిజీ అయిన సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన రెండు షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. గతంలో యాంకర్ ప్రదీప్ చేసిన సర్కార్ గేమ్ షో కి సుధీర్ హోస్ట్ గా ఉన్నారు. సర్కార్ సీజన్ 4 ఆహా లో స్ట్రీమ్ అవుతుండగా... సుధీర్ దుమ్మురేపుతున్నాడు. 

Sudigali Sudheer

అలాగే ఈటీవీ లో ఫ్యామిలీ స్టార్స్ పేరుతో సరికొత్త గేమ్ షో స్టార్ట్ చేశాడు. ప్రతి ఎపిసోడ్ కి కొందరు సెలెబ్స్ ని ఆహ్వానించి వారితో సరదా గేమ్స్ ఆడిస్తున్నాడు. సుడిగాలి సుధీర్ మార్క్ పంచులు, సెటైర్స్ గేమ్ షోలో నవ్వులు పూయిస్తున్నాయి. 
 

Family Stars show

తాజా ఎపిసోడ్ కి పంచ్ ప్రసాద్, యాదమ్మ రాజు, విశ్వా తో పాటు మరికొందరు భార్యలతో వచ్చారు. యాంకర్ స్రవంతి, నటి భాను కూడా ఈ ఎపిసోడ్ లో భాగమయ్యారు. భార్య భర్తల మధ్య గొడవలు చూసి పెళ్లి చేసుకుంటే ఇంత నరకమా... అని సుధీర్ అన్నాడు. మేము అలా చేయము బావా... అని స్రవంతి అన్నది. వాళ్ళు కూడా ముందు ఇదే అన్నారని సుధీర్ భార్యలపై సెటైర్ వేశాడు. 
 

Family Stars show

సుడిగాలి సుధీర్ పై పంచ్ ప్రసాద్ వేసిన జోక్స్ బాగా పేలాయి. ఇక భార్య భర్తల మధ్య బిందిలో నుండి ఉంగరం తీసే పోటీ పెట్టాడు. మొదట పంచ్ ప్రసాద్ తన భార్యతో ఈ గేమ్ ఆడాడు. మీ పెళ్ళిలో ఉంగరం ఫస్ట్ ఎవరు తీశారు? అని సుధీర్ అడిగాడు. పంతులు తీశాడని పంచ్ ప్రసాద్ జోక్ వేశాడు. 
 

Family Stars show

సుడిగాలి సుధీర్ ని ఉద్దేశించి యాంకర్ స్రవంతి... బావా మనం కూడా చేద్దాం, అని రొమాంటిక్ గా అన్నది. దానికి నువ్వు వినవు. ప్యాకప్ చెప్పాక నువ్వు నన్ను కలవవు, అని సుధీర్ అన్నాడు. పెళ్ళైన స్రవంతితో సుడిగాలి సుధీర్ డబుల్ మీనింగ్ జోక్స్ నవ్వులు పూయించాయి. 

Family Stars show

సుడిగాలి సుధీర్ తన ప్లే బాయ్ ఇమేజ్ కొనసాగిస్తూ డబుల్ మీనింగ్ జోక్స్ తో ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. ఫ్యామిలీ స్టార్స్ లేటెస్ట్ ప్రోమో ఆకట్టుకుంది. నెక్స్ట్ ఎపిసోడ్ పై అంచనాలు పెంచేసింది. 
 

Latest Videos

click me!