Heroes Salaries: 2006లో మన స్టార్‌ హీరోల రెమ్యూనరేషన్స్ ఎంతో తెలుసా? అస్సలు ఊహించరు

Published : Jan 29, 2026, 12:33 PM IST

Heroes Salaries: ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు వందల కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. అదే ఇరవై ఏళ్ల క్రితం అంటే 2006లో వీరి రెమ్యూనరేషన్స్ ఎలా ఉండేవో తెలుసా? చూస్తే షాక్‌ అవుతారు. 

PREV
111
2006లో హీరోల పారితోషికాలు

ప్రస్తుతం హీరోహీరోయిన్ల రెమ్యూనరేషన్స్ హాట్‌ టాపిక్‌గా మారుతున్నాయి. పాన్‌ ఇండియా కల్చర్‌ వచ్చాక హీరోల పారితోషికాలు వంద కోట్లు దాటాయి. ప్రభాస్‌, అల్లు అర్జున్‌ వంటి స్టార్స్ రెండు వందల కోట్ల వరకు తీసుకుంటున్నారు. మరి ఇదే హీరోలకు ఇరవై ఏళ్ల క్రితం పారితోషికం ఎంత ఉండేది. వాళ్లు ఎంత తీసుకునే వాళ్లు అనే వివరాలు బయటకు వచ్చాయి. అప్పట్లో ఓ వార్తా పత్రిక మెన్షన్‌ చేసిన వివరాల ప్రకారం చూస్తే.

211
చిరంజీవి రూ.10కోట్లు

ఇరవై ఏళ్ల క్రితం అత్యధిక పారితోషికం తీసుకునే హీరో చిరంజీవినే. అప్పట్లో ఆయనే టాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ అని చెప్పొచ్చు. 2006లో చిరంజీవి `స్టాలిన్‌` మూవీ చేశారు. ఆ టైమ్‌లో ఆయన కెరీర్‌ పరంగా పీక్‌లో ఉన్నారు. ఈ మూవీ కూడా అత్యధిక థియేటర్లలో విడుదలయ్యింది. ఆ టైమ్‌లో చిరంజీవి అందుకున్న పారితోషికం పది కోట్లు అని సమాచారం. అప్పట్లో సినిమా కలెక్షన్లు ముప్పై నలభై కోట్లు మాత్రమే. అలాంటిది ఇప్పుడు రెండు వేల కోట్లకు వెళ్లింది. చిరంజీవి పారితోషికం ఇప్పటి లెక్కల ప్రకారం రెండు వందల కోట్ల స్థాయిలో పారితోషికం అందుకున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు చిరు పారితోషికం దాదాపు రూ.70-80కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

311
నాగార్జున రూ.9కోట్లు

చిరంజీవి తర్వాత ఆ రేంజ్‌లో పారితోషికం అందుకున్న హీరో నాగార్జున. ఆ సమయంలో ఆయన `శ్రీరామదాసు` చేశారు. అది ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ మూవీ టైమ్‌లో నాగార్జున ఏకంగా రూ.9కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారట. సీనియర్‌ హీరోల్లో ఈ ఇద్దరి పారితోషికమే ఎక్కువగా ఉండేది. నాగార్జున ఇప్పుడు రూ.15-20కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నాడట.

411
మహేష్‌ బాబు రూ.5కోట్లు

ఆ తర్వాత సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకి ఎక్కువగా పారితోషికం ఇచ్చారట. 2006లో ఆయన `పోకిరి` మూవీ చేశారు. ఈ మూవీతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టారు. దీంతో భారీగా పారితోషికం అందించారు. అప్పుడు మహేష్‌ రెమ్యూనరేషన్‌ ఐదు కోట్లు అని సమాచారం. ఇప్పుడు వంద కోట్లకుపైగానే పారితోషికం అందుకుంటున్నారట.

511
బాలకృష్ణ, వెంకటేష్‌ రూ.4కోట్లు

ఇక సీనియర్‌ హీరోలు వెంకటేష్‌, బాలకృష్ణ పారితోషికాలు ఇద్దరికీ సేమ్‌. ఇద్దరూ రూ.4కోట్లు తీసుకునేవారట. 2006లో వెంకటేష్‌ `లక్ష్మి` మూవీ చేస్తే, బాలకృష్ణ `వీరభద్ర` చిత్రంలో నటించారు. `లక్ష్మి` యావరేజ్‌గా ఆడింది. బాలయ్య `వీరభద్ర` డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఇద్దరూ ఇరవై కోట్లకుపైగానే డిమాండ్‌ చేస్తున్నారట.

611
పవన్‌ కళ్యాణ్‌ రూ.3.5కోట్లు

2006లో పవన్‌ కళ్యాణ్‌ `బంగారం`, `అన్నవరం` చిత్రాల్లో నటించారు. ఆ టైమ్‌లో పవన్‌ పారితోషికం రూ.3.5కోట్లు కావడం గమనార్హం. దాదాపు మూడేళ్లుగా పవన్‌కి హిట్లు లేవు. దీంతో పారితోషికంలో పెద్దగా మార్పు లేదు. ఇప్పుడు `ఓజీ` సక్సెస్‌ దెబ్బకి వంద కోట్ల వరకు పెరిగిందని సమాచారం.

711
ఎన్టీఆర్‌ రూ.3.5కోట్లు

ఆ టైమ్‌లో ఎన్టీఆర్‌ కూడా స్ట్రగులింగ్‌లోనే ఉన్నారు. వరుసగా ఐదు సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. అయినా రూ.3.5కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. ఆ టైమ్‌లో తారక్‌ `అశోక్‌`, `రాఖి` సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఒక్కో చిత్రానికి తారక్‌ రూ.80-100కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్టు టాక్‌.

811
రవితేజ రూ.3.5కోట్లు

మాస్‌ మహారాజా రవితేజ 2006లో రాజమౌళితో `విక్రమార్కుడు` చేశాడు. కెరీర్‌ పరంగా పీక్‌లో ఉన్నాడు. దీంతో భారీగానే పారితోషికం అందుకున్నాడు. ఆ టైమ్‌లో రవితేజ పారితోషికం రూ.3.5కోట్లు కావడం విశేషం. ఇప్పుడు ఒక్కో మూవీకి రూ.20కోట్ల వరకు పారితోషికం ఉందని సమాచారం.

911
ప్రభాస్‌ రూ.2.5కోట్లు

2006లో ప్రభాస్‌ `పౌర్ణమి` సినిమా చేస్తున్నారు. `ఛత్రపతి` తర్వాత వచ్చిన చిత్రమిది. ఆ టైమ్‌లో ప్రభాస్‌ రూ.2.5కోట్ల పారితోషికమే తీసుకోవడం గమనార్హం. ఇప్పుడు రూ.150-180కోట్ల మధ్య పారితోషికం అందుకుంటున్నాడు.

1011
గోపీచంద్‌ రూ.1.5కోట్లు

ఆ టైమ్‌లో హీరో గోపీచంద్‌ `రణం` సినిమా చేశాడు. `ఆంధ్రుడు` వంటి హిట్‌ తర్వాత చేసిన చిత్రమిది. ఇది కూడా బాగానే ఆడింది. ఆ టైమ్‌లో గోపీచంద్‌ రూ.1.5కోట్ల పారితోషికం తీసుకున్నాడు. ఇప్పుడు ఐదు కోట్లకుపైగానే తీసుకున్నట్టు సమాచారం.

1111
అల్లు అర్జున్‌ రూ.1.5కోట్లు

అప్పట్లో స్టార్స్ గా రాణిస్తున్న వారిలో అల్లు అర్జున్‌ కూడా ఒకరు. 2006లో బన్నీ `హ్యాపీ` మూవీ చేశారు. ఇది పెద్దగా ఆడలేదు. ఆ టైమ్‌లో బన్నీ పారితోషికం కోటిన్నరనే కావడం గమనార్హం. ఇప్పుడు ఆయన పారితోషికం రెండు వందల కోట్లు ఉండటం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories