Top Anchor: అనసూయలాగే సినిమాల్లో అడుగుపెట్టిన మరో టాప్ యాంకర్

Published : Jan 29, 2026, 12:17 PM IST

Top Anchor: అనసూయ, రష్మీ, శ్రీముఖి ఇప్పటికే సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే టాప్ యాంకర్లుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు మరో యాంకర్ స్రవంతి చొక్కారపు సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టబోతోంది. పవన్ కళ్యాణ్ ఇందుకు ప్రేరణ అని చెబుతోంది. 

PREV
14
బిగ్ బాస్‌కు తరువాత

బిగ్ బాస్‌కు రాకముందు స్రవంతి చొక్కారపు అంటే ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ బిగ్ బాస్‌లో ఆమె అందచందాలకు అభిమానులు ఎక్కువైపోయారు. బిగ్ బాస్ నుంచి వచ్చాక విపరీతంగా యాంకరింగ్ అవకాశాలు ఆమెకు వచ్చాయి. ఎన్నో సినిమాలకు ఆమె హోస్టుగా వ్యవహరించింది. ఇన్ స్ట్రాగ్రామ్‌లో కూడా ఆమెకు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. చిన్నప్పటి నుంచి నటి కావాలన్న ఆమె కోరిక ఇప్పుడు తీర్చుకోబోతోంది. టీవీ యాంకర్‌గా కెరీర్ అద్భుతంగా సాగుతున్నప్పటికీ నటిగా గుర్తింపు పొందాలన్న ఆశతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

24
కొత్త సినిమా

స్రవంతి హే భగవాన్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో హీరోగా సుహాస్ నటిస్తున్నారు. సుహాస్ ఇప్పటికే మంచి కథలతో తెలుగు ప్రజల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు అదే సినిమాలో స్రవంతి మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తోందని సమాచారం. ఫిబ్రవరి 20న హే భగవాన్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా హిట్ అయితే స్రవంతి కెరీర్ ఇక చూసువాల్సిన అవసరం లేదు. అందంలో కూడా స్రవంతి హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా ఉంటుంది. కాబట్టి ఆమెకు మరిన్ని సినిమా అవకాశాలు వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తోంది.

34
పవన్ కళ్యాణ్ మాటలతోనే

తన కెరీర్ ప్రయాణంలో ప్రేరణ ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెబుతోంది స్రవంతి. పవన్ కళ్యాణ్ చెప్పిన కొన్ని మాటలు తనకు ఇప్పుడు బలాన్ని ఇస్తాయని చెప్పింది. ‘ఎప్పుడూ నిజాయితీగా ప్రయత్నం చేయాలి.. ఓడిపోయినా మళ్లీ లేచి నిలబడాలి’ అన్న పవన్ కళ్యాణ్ మాటలు తనకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిచ్చాయని.. అందుకే 16 ఏళ్లుగా సినిమాల్లో కెరీర్ స్థాపించుకోవాలని ఎంతో ప్రయత్నం చేసినట్టు ఆమె చెప్పింది. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా తనకు అండగా నిలిచారని వివరించింది.

44
సొంతఊరు

స్రవంతి అనంతపూర్ జిల్లా కదిరి ప్రాంతం. 2009 సంవత్సరంలోనే ఆమె కెరీర్ ప్రారంభించింది. యాంకరింగ్ చేస్తున్నప్పుడే పెళ్లి కూడా చేసుకుంది. కానీ సినిమాల్లో మాత్రం అవకాశాలు రాలేదు. బిగ్ బాస్ లో వచ్చిన ఫేమ్ తో ఆమెకు సినిమా లాంఛింగ్ ఈవెంట్లు చేసే అవకాశాలు వచ్చాయి. అక్కడ పెరిగిన పరిచయాలతో ఇప్పుడు సినిమా అవకాశాన్ని కూడా దక్కించుకుంది స్రవంతి. ఈమెకు స్కూలుకెళ్లే కొడుకు కూడా ఉన్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories