అంబానీ పెళ్లి వేడుకలో మహేష్, చరణ్, వెంకీ, రానా ముందు తేలిపోయిన బాలీవుడ్ హీరోలు..ఒక్కసారి ఈ ఫోటోలు చూడండి

Published : Jul 13, 2024, 10:48 AM IST

అంబానీ పెళ్లి వేడుకలో టాలీవుడ్ హీరోల ముందు బాలీవుడ్ హీరోలు తేలిపోయారు. ఒక్కసారి ఈ ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. 

PREV
120
అంబానీ పెళ్లి వేడుకలో మహేష్, చరణ్, వెంకీ, రానా ముందు తేలిపోయిన బాలీవుడ్ హీరోలు..ఒక్కసారి ఈ ఫోటోలు చూడండి

అంబానీ ఇంట పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటేలా జరుగుతున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులంతా అనంత్ అంబానీ, రాధిక పెళ్లి వేడుకకి హాజరయ్యారు. 

220

ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్ళికి కనీవినీ ఎరుగని విధంగా ఏకంగా 5 వేల కోట్లు ఖర్చు చేసారని వినికిడి. పెళ్లి వేడుకలో అనంత్ అంబానీ, రాధికా కళ్ళు చెదిరే వస్త్ర ధారణ, ఆభరణాలు ధరించి కనిపించారు. 

320

ఇంతటి గ్రాండ్ వెడ్డింగ్ కి ప్రపంచం నలుమూలల ఉన్న హాలీవుడ్ స్టార్,పాప్ సింగర్స్, స్పోర్ట్స్ సెలెబ్రిటీస్, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అదే విధంగా బాలీవుడ్ నటీనటులు, టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రిటీలు సందడి చేశారు. 

420

హీరోయిన్లు అయితే ఒకరిని మించే విధంగా మరొకరు అన్నట్లుగా అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో సందడి చేశారు. సల్మాన్ ఖాన్, షారుఖ్, రణబీర్ కపూర్, బచ్చన్ ఫ్యామిలీ ఇలా  అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో కనిపించారు. 

520

బాలీవుడ్ ప్రముఖులు.. అంబానీ ఫ్యామిలీతో చాలా క్లోజ్ గా ఉంటారు. పెళ్లి సందడి మొత్తం బాలీవుడ్ వాళ్లదే అన్నట్లుగా కనిపించింది. కానీ తెలుగు హీరోలు ఎంటర్ అయి సీన్ మొత్తం మార్చేశారు. 

620

టాలీవుడ్ నుంచి మహేష్, బాబు రాంచరణ్, రానా దగ్గుబాటి తమ భార్యలతో హాజరయ్యారు. అలాగే విక్టరీ వెంకటేష్ కూడా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో కనిపించారు.

 

720

 టాలీవుడ్ హీరోల లుక్, స్టైల్ ముందు బాలీవుడ్ హీరోలు తేలిపోయినట్లు కామెంట్స్ పడుతునున్నాయి. కొందరు బాలీవుడ్ హీరోలు ఏమాత్రం ఆకట్టుకొని స్టైల్ లో కనిపించారు. 

820

మహేష్ బాబు రాజమౌళి సినిమాకి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. దీనితో ఎవరూ ఊహించని విధంగా మహేష్ చాలా రోజుల తర్వాత లాంగ్ హెయిర్ తో కనిపించారు. 

920

 బ్లాక్ సూట్ ధరించిన మహేష్ యమా స్టయిల్ గా హుందాగా ఉన్నారు. ఆయన సతీమణి నమ్రత, కుమార్తె సితార ట్రెడిషనల్ గా కనిపించారు. సితార కూడా తన క్యూట్ లుక్స్ తో అందరిని ఆకర్షించింది. 

1020

ఇక రాంచరణ్ విషయానికి వస్తే.. చరణ్ తన సతీమణి ఉపాసనతో కలసి హాజరయ్యారు. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ డమ్ తర్వాత నార్త్ లో చరణ్ క్రేజీ హీరోగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. 

1120

రాంచరణ్ వైట్ కుర్తా ఫైజామ్ ధరించి స్టైలిష్ గా కనిపించాడు. తన స్టైలిష్ యాటిట్యూడ్ తో అదిరిపోయే ఫోజులు ఇచ్చాడు. ఉపాసన స్కె బ్లూ కలర్ శారీలో ట్రెడిషనల్ గా మెరిశారు. 

1220

రానా దగ్గుబాటి కూడా తన సతీమణి మిహీక బజాజ్ తో కలసి సందడి చేశాడు.  రానా వైట్ డ్రెస్ ధరించగా, మిహీక రెడ్ లెహంగాలో కలర్ ఫుల్ గా కనిపించారు. బాహుబలి చిత్రంతో రానా కూడా నార్త్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. 

1320

ఇక విక్టరీ వెంకటేష్ సోలోగా అంబానీ వెడ్డింగ్ లో సందడి చేశారు. వెంకీ సింపుల్ గా కనిపిస్తూనే  స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నారు. టాలీవుడ్ నుంచి మరికొందరు సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. 

1420

హీరోయిన్లలో జాన్వీ కపూర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. గోల్డ్ కలర్ లెహంగాలో మహారాణిలా జాన్వీ ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

1520

షారుఖ్ ఖాన్ సతీసమేతంగా హాజరయ్యారు. ఇక బ్రహ్మచారిగా ఉన్న సల్మాన్ ఖాన్ తన సోదరి అర్పితతో అంబానీ వెడ్డింగ్ సందడి చేశారు. సల్మాన్ ఖాన్ కంప్లీట్ బ్లాక్ డ్రెస్ లో కనిపించగా ఆ డ్రెస్ అంతగా ఆకట్టుకునే విధంగా లేదు. 

1620

అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ మొత్తం అంబానీ వెడ్డింగ్ లో సందడి చేశారు. అయితే ఐశ్వర్య రాయ్, ఆమె కుమార్తె ఆరాధ్య పైనే అందరి చూపు పడింది. రెడ్ డ్రెస్ లో ఐశ్వర్య కనిపించగా.. ఆరాధ్య తల్లినిమించే క్యూట్ లుక్స్ లో మెస్మరైజ్ చేసింది. 

1720

నయనతార తన భర్త విగ్నేష్ లో కళ్ళు చెదిరే అందంతో కనిపించింది.సిల్వర్ కలర్ శారీలో నయనతార మెరుపులు మెరిపించింది. విగ్నేష్ మాత్రం పంచె కట్టులో కనిపించారు. 

1820

అక్కడ ఫోటో గ్రాఫర్లని ఆకర్షించిన మరో సెలెబ్రిటీ జోడి సూర్య, జ్యోతిక. సూర్య పంచెకట్టుతో అదిరిపోయే లుక్ లో సందడి చేశారు. జ్యోతిక మెరుపులు మెరిపిస్తున్న పట్టు శారీలో ఆకర్షించింది. 

1920

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, తన భర్త నిక్ జోనస్ తో సందడి చేసింది. ప్రియాంక కూడా అందమైన డ్రెస్ లో మెరిసింది. నిక్ జోనస్ ఇండియన్ ట్రెడిషన్ కి తగ్గట్లుగా కుర్తా ఫైజామ్ లో మెరిశారు. 

 

2020

పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీ కూడా తన సతీమణితో సందడి చేశారు. ఏది ఏమైనా అంబానీ పెళ్లి వేడుకలో టాలీవుడ్ హీరోల ముందు బాలీవుడ్ హీరోలు తేలిపోయారు. 

 

Read more Photos on
click me!

Recommended Stories