చెప్పు తీసుకుని కొట్టేదాన్ని, నేను సర్జరీ చేయించుకున్నానా, పెళ్లి కాదా?... ఆ సీనియర్ మీద జబర్దస్త్ రోహిణి ఫైర్

First Published | Jul 13, 2024, 8:32 AM IST


జబర్దస్త్ రోహిణి ఫైర్ అయ్యారు. ఇంకొకరు అయితే చెప్పుతో కొట్టేదాన్ని అంటూ ఓ సీనియర్ మీద విరుచుకు పడింది. అందుకు ఆయన చేసిన సీరియస్ ఆరోపణలు కారణం అయ్యాయి. 
 

Jabardasth Rohini


రోహిణి పరిచయం అక్కర్లేని పేరు. కెరీర్ బిగినింగ్ లో సీరియల్స్ లో నటించిన రోహిణి జబర్దస్త్ షోతో పాప్యులర్ అయ్యింది. లేడీ కమెడియన్ గా జబర్దస్త్ లో రోహిణి తన మార్క్ క్రియేట్ చేసింది. సిల్వర్ స్క్రీన్ పై కూడా రోహిణి రాణిస్తుంది. బలగం వంటి బ్లాక్ బస్టర్ మూవీలో ఓ కామెడీ రోల్ చేసింది. వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ లో రోహిణి పాత్ర చాలా హిలేరియస్ గా ఉంటుంది. 

Hyper Aadi

కాగా ఇటీవల రోహిణి వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఆ వీడియోలో రోహిణి ని పోలీసులు అరెస్ట్ చేశారు. రోహిణి ఓ రేవ్ పార్టీలో పాల్గొన్న నేపథ్యంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నాకేమి తెలియదు. నేను డ్రగ్స్ తీసుకోలేదు. ఎన్నారై బర్త్ డే పార్టీ అంటే వచ్చానని...  ఆ వీడియోలో రోహిణి బ్రతిమిలాడుకున్నారు. రోహిణి అరెస్ట్ పై ఎలాంటి న్యూస్ లేదు. 


Jabardasth Rohini

దీంతో రోహిణి ఫ్రాంక్ చేశారని అందరికీ క్లారిటీ వచ్చింది. బర్త్ డే బాయ్ అనే ఓ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రోహిణి రేవ్ పార్టీకి హాజరై అరెస్ట్ అయినట్లు ఫేక్ వీడియో చేసింది. అయితే ఈ వీడియో నిజమే అంటూ ఓ సీనియర్ జర్నలిస్ట్ కామెంట్స్ చేసిన తరుణంలో రోహిణి స్పందించారు. ఒకింత ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది. 

రోహిణి ఇంస్టాగ్రామ్ వేదికగా వీడియో బైట్ వదిలింది. నేను ఇటీవల బర్త్ డే బాయ్ మూవీ ప్రమోషన్స్ కోసం రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ఫ్రాంక్ వీడియో చేశాను. అది ఫేక్ వీడియో అని మీడియా వాళ్ళు గుర్తించారు. సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే సీనియర్ జర్నలిస్ట్ హనుమంతరావు చేసిన కామెంట్స్ ఇబ్బంది పెట్టాయి. 

Jabardasth Rohini

నిప్పు లేనిదే పొగరాదు అంటారు. ఆమె డ్రగ్స్ తీసుకునే ఉంటుంది. అందుకే పోలీసులు పట్టుకున్నారని అంటారా? మీరు పర్సనల్ గా కూడా నా మీద అటాక్ చేశారు. ఆమెకు సర్జరీ జరగడం వలన బరువు పెరిగింది. పెళ్లి కూడా చేసుకునే ఆలోచన లేదేమో అన్నారు.  లావుగా ఉన్నోళ్లకు పెళ్లిళ్లు కావా? పెళ్లి చేసుకోకూడదా?. మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకొకరిని అయితే చెప్పుతో కొట్టేదాన్ని. 

Jabardasth Rohini

నాకు మందు అలవాటు కూడా లేదు. సినిమాల్లో చేసినవన్నీ నిజ జీవితంలో చేస్తారా?  సీనియర్ జర్నలిస్ట్ గా ఒక సంఘటన జరిగితే... అది నిజమా? అబద్దమా? అని తెలుసుకుని మాట్లాడాలి. మీకు పనిలేక పోతే, ఖాళీగా ఉంటే ఇంట్లో కూర్చోండి. ఇలాంటి కామెంట్స్ చేయకండి... అంటూ రోహిణి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. ఈ వీడియో వైరల్ అవుతుంది. 

Latest Videos

click me!