స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Sing) లేటెస్ట్ గా పంచుకున్న ఫొటో ఆసక్తికరంగా మారింది. ఆమె ముఖం గుర్తుపడ్డటానికి చాలా కష్టమనేలా ఉంది. ఇంతకీ ఏమైందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మకు సౌత్ లో ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.
26
సౌత్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన రకుల్ అటు బాలీవుడ్ లోనూ వరుస చిత్రాలతో అలరించింది. ఇప్పుడు మళ్లీ దక్షిణాది సినిమాలతో బిజీ అవుతోంది. ఇక రీసెంట్ గా ‘ఆయలాన్’ చిత్రంతో అలరించింది.
36
ఇదిలా ఉంటే ఈ మధ్యనే రకుల్ తన ప్రియుడు, బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ (Jaccky Bhagnani) తో పెళ్లి పీటలు ఎక్కింది. గోవాలో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. సింగ్, సింథియా సంప్రదాయాల్లో రెండు సార్లు వివాహం చేసుకున్నారు.
46
ఇప్పటికీ నెట్టింట వీరిద్దరి బ్యూటీఫుల్ వెడ్డింగ్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. పట్టు వస్త్రాల్లో రకుల్ ఎంతో అందంగా మెరిసింది. పెళ్లి తర్వాత తాజాగా రకుల్ పంచుకున్న ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది.
56
మహాశివరాత్రి (MahaShivaRatri) సందర్భంగా రకుల్ ఇషా షౌండేషన్ ఆధ్వర్యంలో తమిళనాడులోని ఆదియోగి (Aadhi Yogi) ని దర్శించుకుంది. ఈ సందర్బంగా శివ నామస్మరణ చేసింది. ఓ సెల్ఫీ ఫొటోను అభిమానులతో పంచుకుంది.
66
ఇందులో రకుల్ పూర్తిగా గుర్తుపట్టలేనంతగా కనిపించింది. తన ఫేస్ లో నిజంగానే మార్పులు వచ్చాయా? అనంతలా కనిపించింది. కానీ సెల్ఫీ కావడంతో అలా కనిపిస్తుందని తెలుస్తోంది.