రేపులు జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు, శివరాత్రి వేళ బిగ్ బాస్ కీర్తి సంచలన కామెంట్స్ 

Published : Mar 09, 2024, 08:15 AM IST

బిగ్ బాస్ కీర్తి శివరాత్రి పండగ వేళ దేవుడు మీద సంచలన ఆరోపణలు చేసింది. దేశంలో అరాచకాలు జరుగుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడు. అలాంటప్పుడు పూజలు ఎందుకని ఆమె ప్రశ్నించారు.   

PREV
16
రేపులు జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు, శివరాత్రి వేళ బిగ్ బాస్ కీర్తి సంచలన కామెంట్స్ 
Keerthi Bhat

బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. పలు సామాజిక విషయాల మీద స్పందిస్తారు. ఇటీవల ఆమె కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ ని కాబోయే భర్తతో పాటు విజిట్ చేసింది. అక్కడి ఫుడ్ ఆమెకు నచ్చలేదని రివ్యూ ఇచ్చింది. ఒకటే కారం. కుమారీ ఆంటీ కంటే నేనే రుచిగా చికెన్ చేస్తానని కామెంట్స్ చేసింది. 

 

26
Keerthi bhat

కీర్తి భట్ అభిప్రాయాన్ని కొందరు సమర్ధించగా కొందరు తిరస్కరించారు. తాజాగా ఆమె దేవుడిని ఉద్దేశిస్తూ సంచలన కామెంట్స్ చేసింది. శివరాత్రి పర్వదినాన దేవుడి మీద ఘాటైన మాటలు వదిలింది. దేశంలో అరాచకాలు జరుగుతున్నాయి. దేవుడు ఆపకుండా ఏం చేస్తున్నాడనే అర్థంలో ఆవేదన వెళ్లగక్కింది. 

36

శివరాత్రి రోజే కాదు, ఎప్పుడైనా మనం దేవుడికి పూజ ఎందుకు చేస్తాము? అందరూ బాగుండాలని కదా? అందరికీ మంచి జరగాలని కదా?. కానీ అలా జరగడం లేదు. ఒక చిన్నారిని గ్యాంగ్ రేప్ చేశారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? చూస్తూ ఊరుకున్నాడు. 
 

46

రేప్ కి గురైన ఆ చిన్నారి ఎంత వేదనకు గురై ఉంటుంది. అప్పుడు దేవుడు ఆమెను కాపాడాలి. కనీసం ఆ రేప్ నుండి తప్పించుకునేలా చేయాలి. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. పేదవాళ్ళు పేదవాళ్ళగానే మిగిలిపోతున్నారు. 

 

56

దేవుడు ఇవన్నీ చూస్తూ ఊరుకుంటున్నాడు. అందుకే ఒక్కోసారి దేవుడు ఫోటోలు పక్కన పెట్టేద్దాం. పూజలు చేయడం మానేద్దాం అనిపిస్తుందని... కీర్తి భట్ కీలక కామెంట్స్ చేసింది. కీర్తి భట్ ఇంస్టాగ్రామ్ లో ఈ మేరకు పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. 

66
Bigg Boss Telugu 6


సీరియల్ నటి అయిన కీర్తి భట్ బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొంది. స్ట్రాంగ్ ప్లేయర్ గా ఆమె ఫైనల్ కి వెళ్ళింది. కీర్తి భట్ కి 4వ స్థానం దక్కింది. కార్తీక దీపం సీరియల్ లో నటించిన కీర్తి భట్ ప్రస్తుతం మధురా నగరిలో అనే సీరియల్ చేస్తుంది. ఇది స్టార్ మా లో ప్రసారం అవుతుంది. 
 

click me!

Recommended Stories