మెగా పిన్స్ వరుణ్ తేజ్ విభిన్న కథలతో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి నుంచి ఆయన చిత్రాలు మరో చిత్రంతో ఏమాత్రం పోలిక లేకుండా ఉన్నాయి.
రోటీన్ కు భిన్నంగా కథలు ఎంచుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సినిమా ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఆయన చేసే సినిమాలో మంచి కంటెంట్ ను అందించాలనే ఆలోచనను ఏమాత్రం దూరం చేయడం లేదు.
ఈ క్రమంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న తొలి తెలుగు చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్స్’ (Operation Valentine). ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తండ్రి నాగబాబు కూడా హాజరయ్యారు.
ఈ సందర్బంగా వేదికపై వరుణ్ తేజ్ సినిమాల గురించి మాట్లాడారు.... వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాల విషయంలో చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కానీ వరుసగా వరుణ్ ఫెయిల్యూర్ చూస్తున్నారు. ఎంతో కష్టపడ్డా ఫలితం లేదనే భావన కలుగుతోంది.
వరుణ్ తేజ్ సినిమా ఫెయిల్ అయితే ఎంతో బాధపడుతారు. ఆ రోజంతా ఇంట్లో మౌనంగా ఉంటాడు. నేను కూడా చాలా బాధపడుతాను. సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంటాను. కానీ వరుణ్ చేస్తున్న ఒక్కో సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
ఇలా సినిమాలు చేయడంతో ప్రస్తుతం వరుణ్ కు స్పెషల్ ఇమేజ్ క్రియేట్ అయ్యింది. ఇలాగే ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నారు. ఇప్పుడు ‘ఆపరేషన్ వాలెంటైన్స్‘తో ఆర్మీ ఆఫీసర్ గా అలరించబోతుండటం సంతోషంగా ఉందన్నారు. ఇలా తొలిసారిగా వరుణ్ తేజ్ సినిమా ఫంక్షన్ కు వచ్చి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.