Keerthy Suresh : కీర్తి సురేష్ కెరీర్ లోనే ఫస్ట్ టైమ్.. అవధులు దాటేస్తున్న మహానటి!

First Published | Feb 25, 2024, 8:46 PM IST

మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh)  ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ప్రస్తుతం తన కెరీర్ లోనే మొదటిసారిగా ఆ పాత్రలో నటించి... ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా రూట్ మార్చి ఆకట్టుకుంటోంది.

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళం, మలయాళం చిత్రాల్లో గుర్తింపు పొంది... టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతే స్టార్ స్టేటస్ దక్కించుకుంది.

‘మహానటి’ చిత్రం తర్వాత కీర్తి సురేష్ కు ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే. ఆ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డ్ ను కూడా దక్కించుకుంది. అలాగే స్టార్ హీరోల సరసన నటిస్తూ వచ్చింది. మంచి సక్సెస్ ను కూడా అందుకుంది. 


చివరిగా ‘సర్కారు వారి పాట’, ‘దసరా’ వంటి చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్లను అందుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్కొటి షూటింగ్ పూర్తి చేసుకుంటూ.. రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. 

ప్రస్తుతం కీర్తి సురేష్ నుంచి తమిళ చిత్రం ‘సైరెన్’ (Siren)  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో కీర్తి పోలీసు ఆఫీసర్ గా కనిపించింది. తన కెరీర్ లోనే పోలీస్ పాత్రలో కీర్తి మొదటిసారిగా కనిపించడం ఆసక్తికరంగా మారింది.

ఇక ఈమూవీ ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ బిజీగా ఉన్నారు. ఇందుకోసం డిఫరెంట్ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. గతంలో ఈ ముద్దుగుమ్మ కేవలం ట్రెడిషనల్ లుక్ కే ప్రాధాన్యత ఇచ్చేది.. మరోవైపు కెరీర్ లో మొదటి సారి బాలీవుడ్ లో సినిమా చేస్తుండటంతోనూ రూట్ మార్చింది.

ఈ సందర్భంగా కీర్తి మాత్రం ట్రెండీ అవుట్ ఫిట్లలో అదరగొడుతోంది. తాజాగా వైట్ అవుట్ ఫిట్ లో స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది. స్టన్నింగ్ స్టిల్స్ ఇస్తూ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

Latest Videos

click me!