‘బాహుబలి’తో అనుష్క శెట్టి (Anushka Shetty) దేశ వ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్నారు. సినిమా కోసం ఎంతగానో శ్రమిస్తుంటారు. స్విటీ కేవలం నటనకే పరిమితం కాలేదు. తనకు యోగా అంటే చాలా ఇష్టం. ఆసక్తి కూడా. అందులో ప్రావీణ్యం సాధించింది. కొన్నాళ్లు ట్రెయినింగ్ కూడా ఇచ్చింది. సినిమాల్లోకి వచ్చాక మానేసింది. అలాగే తను టీచింగ్ కూడా చేయగలదు.
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఎప్పుడు ఫిట్ గానే కనిపిస్తుంటుంది. అందుకు కారణం ఆమెకు జిమ్ పరికరాలు, వ్యాయమాల పట్ల చాలా అవగాహన ఉంది. తను బాడీ బిల్డింగ్, ఫిట్ నెస్ ట్రెయినింగ్ కూడా ఇవ్వగలదు. తనలోని ఈ హిడెన్ టాలెంట్ కారణంగానే వైజాగ్, హైదరాబాద్ లో జిమ్ సెంటర్లనూ ఓపెన్ చేసింది.
పవన్ కళ్యాణ్ హీరోయిన్ భూమికా చావ్లా (Bhumika Chawla) కూ ఓ హిడెన్ టాలెంట్ ఉంది. నటించడమే కాకుండా.. తను కవిత్వం బాగా రాయగలదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హిందీలో సాహిత్య ప్రతిభను కనబరుస్తూ ఉంటుంది.
నానితో ‘అలా మొదలైంది’ చిత్రంతో నిత్యా మీనన్ (Nithya Menon) తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. ఈ ముద్దుగుమ్మ ఎనిమిది భాషలు తెలుసు. అలాగే అద్భుతంగా పాటలు పాడుతుంది. చాలా సాంగ్స్ కూడా పాడింది.
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా (Sreeleela ) యాక్టింగ్, డాన్స్ తో ఇరగదీస్తున్న విషయం తెలిసిందే. ఆమె దాగిన హిడెన్ టాలెంట్ భరతనాట్యం. నాలుగేళ్ల నుంచే క్లాసిక్ డాన్స్ పై శిక్షణ తీసుకుంది. అనతికాలంలో పట్టుసాధించింది. ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తోంది.
‘తలైవా 170’ చిత్రంలో నటిస్తున్న యంగ్ బ్యూటీ రితికా సింగ్ (Ritika Singh) ఒక మార్షల్ ఆర్టిస్ట్. సినిమాల్లో రావడానికి ముందు ఆ స్పోర్ట్స్ లో అదరగొట్టింది. ప్రస్తుతం నటిగా పేరు సంపాదించుకుంటోంది. ‘అదిరింది’ చిత్రంతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగులో ‘గురు’ సినిమా కూడా చేసింది.
ఇక బాలీవుడ్ ముద్దుగుమ్మల విషయానికొస్తే.. టాలెంటెడ్ హీరోయిన్ విద్యా బాలన్ (Vidya Balan) అద్భుతంగా మిమిక్రీ చేయగలదు. అలాగే కవితలూ రాస్తుంటుంది.
‘లైగర్’ భామ అనన్య పాండే (Ananya Panday) కూ ఓ సూపర్ హిడెన్ టాలెంట్ ఉంది. తను నాలుకను ముక్కుతో తాకి మరీ మాట్లాడగలదు. ఇలాంటి ప్రతిభ చాలా అరుదని చెప్పొచ్చు.
ఎన్టీఆర్ ‘దేవర’తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న జాన్వీ కపూర్ (Janhvi Kapoor)కు పెయింటింగ్ అంటే ఇష్టం. షూటింగ్స్ లేనప్పుడల్లా పెయింగ్స్ వేస్తుంటుంది. చాలా చక్కగా పెయింటింగ్ చేయగలదు.