సాయి పల్లవి హీరోయిన్ గా సౌత్ లో ఎంత స్టార్ డమ్ సంపాదించిందో అందరికి తెలుసు. డాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీ... ఫిల్మ్ కెరీర్ ను చూసుకుంటూనే.. తన MBBS ను కంప్లీట్ చేసింది. పేదవారి డాక్టర్ గా పేరు తెచ్చుకుంటా అంటోంది సాయి.. సినిమాల విషయంలో కూడా సెలక్టీవ్ గా వెళ్తోన్న సాయి పల్లవి.. స్టార్ హీరో అని చూడకుండా.. తన పాత్ర ఇంపార్టెన్స్ ను బట్టి సినిమా చేస్తుంది.