ట్రెడిషనల్ బ్యూటీ ప్రియాంక మోహన్ క్యూట్ లుక్స్.. కొంటె చూపులతో మైమరిపిస్తున్నకోలీవుడ్ భామా..

Published : Jul 03, 2022, 01:48 PM IST

తమిళ బ్యూటీ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఇటు సంప్రదాయ దుస్తుల్లోనే వరుస ఫొటోషూట్లు చేస్తూ ట్రెడిషనల్ హీరోయిన్ గా పేరొందుతోంది.   

PREV
16
ట్రెడిషనల్ బ్యూటీ ప్రియాంక మోహన్ క్యూట్ లుక్స్.. కొంటె చూపులతో మైమరిపిస్తున్నకోలీవుడ్ భామా..

కోలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ వరుస చిత్రాల్లో నటిస్తూ అటు తమిళ ప్రేక్షకులు, ఇటు తెలుగు ప్రేక్షకుల గుండెల్ని చోటు దక్కించుకుంటోంది. ప్రస్తుతం రెండు భాషల్లో వరుస చిత్రాల్లో నటిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంటూ కేరీర్ లో దూసుకుపోతోంది.
 

26

ప్రియాంక మోహన్ గురించి చెప్పాలంటే.. గ్లామర్, పెర్ఫామెన్స్ పరంగా మంచి మార్కులే పొందింది. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను దక్కించుకుంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తోంది. అయితే ఈ బ్యూటీకి ఇప్పటి వరకు సాలిడ్ హిట్ పడలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఆ దిశగానే అడుగులేస్తోంది.
 

36

అయితే ప్రియాంక తన పాపులారిటీని పెంచుకునేందుకు ఇటు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా ఉంటోంది. సినిమాలతో సంబంధం లేకుండా.. అభిమానులతో ఎప్పటికీ టచ్ లోనే ఉంటోంది. తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటూ తన పాలోవర్స్ కు మరింత దగ్గరవుతోంది.

46

ఈ సందర్భంగా ట్రెడిషనల్ వేర్స్ లో అదిరిపోయే ఫొటోషూట్లు చేస్తూ కుర్రాళ్లను మత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ క్యూట్ సెల్ఫీ పిక్స్ ను ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ ఇంటర్నెట్ లో నెటిజన్లను ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి.  

56

లేటెస్ట్ ఫొటోల్లో ప్రియాంక చాలా క్యూట్ గా కనిపిస్తోంది. రెడ్ డ్రెస్ ధరించిన తమిళ బ్యూటీ కొంటె చూపులతో కుర్రాళ్లను మైమరిపిస్తోంది. ఓ రెస్టారెంట్ లో అట్రాక్టివ్ గా ఫొటోలకు పోజులిచ్చింది. తన ఫాలోవర్స్ ఫొటోలకు లైక్స్, కామెంట్లు పెడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు.

66

నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన ‘గ్యాంగ్ లీడర్’తో తెలుగు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అప్పటి నుంచి తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ సౌత్ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఇటీవల సూర్య (Suriya)తో కలిసి ‘ఈటీ’లో మెరిసింది. ఆ తర్వాత ‘డాన్’తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఏ స్టార్ సరనన నటించబోతుందో ఇంకా ప్రకటించాల్సి ఉంది.
 

Read more Photos on
click me!

Recommended Stories