విదేశాల నుంచి వచ్చినా.. మన దేశంలో కూడా సూపర్ హిట్ అయిన టెలివిజన్ షో బిగ్ బాస్. హిందీతో పాటు దాదాపు అన్ని రీజినల్ లాంగ్వేజెస్‌లోనూ ఈ షో సూపర్ హిట్ అయ్యింది. టాప్ స్టార్ల యాంకరింగ్, వివాదాలు, గ్లామర్, ఎంటర్‌టైన్మెంట్ ఇలా దేనికి కోదువ లేని బిగ్ బాస్ షో టాలీవుడ్ లో సరికొత్త సీజన్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే మూడు సీజన్‌లలో సూపర్ హిట్ అయిన ఈ షో 4వ సీజన్‌కు రెడీ అవుతోంది.
మరోసారి కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో హడావిడి మొదలైంది. ఇప్పటికే ప్రోమోలు కూడా విడుదల అయ్యాయి. ఇక కంటెస్టెంట్‌లు వీరే అంటూ మీడియాలో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ లిస్ట్ టీవీ, సినిమా, యూట్యూబ్ స్టార్లు కూడా ఉన్నారు. అయితే అధికారికంగా మాత్రం ఒక్కరి పేరే కన్‌ఫాం అయ్యింది.
టాలీవుడ్ యంగ్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నందు బిగ్ బాస్ షోలోకి వెళ్లటం కన్‌ఫామ్ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా పేజ్‌లో ప్రకటించారు. ఆదివారం ఓ బిగ్ (Bigg) అప్ డేట్ ఇస్తా అంటూ నందు చెప్పినప్పుడే అంతా బిగ్ బాస్ గురించే అని ఫిక్స్ అయ్యారు. అదే విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు నందు.
గత సీజన్‌లో నందు భార్య, ప్రముఖ గాయని గీతా మాధురి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. నేమ్ తో పాటు మంచి ప్యాకేజ్ కూడా దక్కుతుండటంతో హౌస్‌లోకి వెళ్లేందుకు యంగ్ జనరేషన్ తారలు బాగానే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే నందు కాకుండా ఇంకా ఎవరెవరు వెళుతున్నారన్న విషయంలో మాత్రం చాలా పేర్లే తెర మీదకు వస్తున్నాయి.
బిగ్ బాస్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్‌లు వీళ్లే అన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది.