కష్టకాలంలో సల్మాన్‌ ఆదుకున్నారంటున్న జరీన్‌ఖాన్‌

First Published | Aug 24, 2020, 8:49 PM IST

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా నిలదొక్కుకునేందుకు స్ట్రగుల్‌ అవుతున్న హీరోయిన్‌ జరీన్‌ ఖాన్‌. సల్మాన్‌ ఖాన్‌ వంటి స్టార్‌ హీరో సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చినా సరైనా గుర్తింపును తెచ్చుకోవడంలో విఫలమయ్యింది. అడపాదడపా ఏడాదికి ఒక్కటో రెండో సినిమా అవకాశాలను దక్కించుకుంటూ తనేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. 

అయితే ప్రస్తుతం తాను ఈ స్థితిలో ఉన్నానంటే అందుకు సల్మాన్‌ ఖానే కారణమని చెబుతోంది జరీన్‌ ఖాన్‌. అదే సమయంలో అన్ని అవకాశాలకు సల్మానే కారణం కాదనిచెబుతోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో జరీన్‌ చెబుతూ, సల్మాన్‌ ఖాన్‌ వల్లే తనకు అన్ని సినిమాలు వచ్చాయని చెప్పడంలో వాస్తవం లేదని తెలిపింది.

బాలీవుడ్‌లో అడుగుపెట్టిన కొత్తలో తాను కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పింది. అవకాశలు కోసం చాలా స్ట్రగుల్‌ అయినట్టు పేర్కొంది.
తన తొలి సినిమా `వీర్‌` ప్లాప్‌ అవడానికి తానే కారణమని చాలా మంది విమర్శించారని, తనపై నిందలు వేశారని చెబుతూ విచారం వ్యక్తం చేసింది.
ఆ సినిమా పరాజయంతో, తనపై వచ్చిన విమర్శలతో తనకు అవకాశాలు రాలేదని తెలిపింది. చాలా కష్టంగా ఛాన్స్ లు వచ్చాయని చెప్పింది.
అయితే కష్ట కాలంలో సల్మాన్‌ ఆదుకున్నారని, తోడ్పాటుని అందించారని పేర్కొంది.
కానీ ఇప్పటి వరకు వచ్చిన అవకాశాలన్నీ ఆయన వల్లే అనడం సబబు కాదు. ఆ తర్వాత అన్ని అవకాశాలు నా స్వశక్తితో సంపాదించుకున్నవేనని తెలిపింది.
`వీర్‌` సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జరీన్‌ ఖాన్‌ `హౌజ్‌ఫుల్‌ 2`, `హేట్‌ స్టోరీ3`, `అక్సర్‌ 2`, `1921` వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది.
దీంతోపాటు `రెడీ`, `వీరప్పన్‌`, `వాజా తుమ్‌ హో` వంటి హిందీ చిత్రాల్లో, అలాగే `నాన్‌ రాజవగ పోగిరెన్‌` చిత్రంలో ప్రత్యేక పాటలో మెరిసింది.
గతేడాది తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి గోపీచంద్‌ హీరోగా రూపొందిన `చాణక్య`లో కీలక పాత్ర పోషించింది. ఇందులో అందంతోపాటు యాక్షన్‌తోనూ అదగొట్టింది. ప్రస్తుతం `హమ్‌ భీఅకెలె తుమ్‌ భీ అకెలే` చిత్రంలో నటిస్తుంది.

Latest Videos

click me!