తప్పు నాదే: ఎస్పీ బాలు కరోనా నెగిటివ్ వార్తలపై చరణ్ ట్విస్ట్

Published : Aug 25, 2020, 07:13 AM ISTUpdated : Aug 25, 2020, 07:36 AM IST

ఎస్పీ బాలుకు నెగెటివ్ వచ్చినట్లు తొలుత మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్తలు నిజం కాదంటూ ఆ తర్వాత ఎస్పీ చరణ్ వివరణ ఇచ్చారు. తాజాగా చరణ్ తండ్రి ఎస్బీ బాలు ఆరోగ్యంపై ఓ వీడియో విడుదల చేశారు. 

PREV
16
తప్పు నాదే: ఎస్పీ బాలు కరోనా నెగిటివ్ వార్తలపై చరణ్ ట్విస్ట్

ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగెటివ్ నిర్ధారణ అయినట్లు సోమవారం ఉదయం వచ్చిన వార్తలపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ వివరణ ఇచ్చారు. తానే అలా చెప్పమన్నట్లు ఆయన తెలిపారు. తానే మీడియాకు ఆ సమాచారం అందించినట్లు తెలిపారు.

26

ఎస్పీ బాలుకు నెగెటివ్ వచ్చినట్లు తొలుత మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్తలు నిజం కాదంటూ ఆ తర్వాత ఎస్పీ చరణ్ వివరణ ఇచ్చారు. తాజాగా చరణ్ తండ్రి ఎస్బీ బాలు ఆరోగ్యంపై ఓ వీడియో విడుదల చేశారు. 

ఎస్పీ బాలుకు నెగెటివ్ వచ్చినట్లు తొలుత మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్తలు నిజం కాదంటూ ఆ తర్వాత ఎస్పీ చరణ్ వివరణ ఇచ్చారు. తాజాగా చరణ్ తండ్రి ఎస్బీ బాలు ఆరోగ్యంపై ఓ వీడియో విడుదల చేశారు. 

36

తాను పూజలో ఉండడం వల్ల సోమవారంనాడు మీడియాకు సరిగా సమాచారం అందించలేకపోయానని ఆయన చెప్పారు. నాన్న కోలుకుంటున్నారని, సైగలతో స్పందిస్తున్నారని చరణ్ చెప్పారు. నాన్న ధైర్యంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. 

46

ఈ రోజే (సోమవారం) తాను నాన్నను కలిసినట్లు, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే క్షేమంగా మనందరి ముందుకు వస్తారని ఆయన అన్నారు. దాదాపు రెండు వారాల తర్వాత నాన్నను తాను కలిసినట్లు, తనను చూసి గుర్తు పట్టినట్లు ఆయన తెలిపారు. తాను చెప్పిన మాటలకు బొటనవేలు పైకి ఎత్తి సంకేతాలు ఇచ్చారని చెప్పారు. 

56

నువ్వు ఎలా ఉన్నావని సైగలతో అడిగారని, అమ్మ ఎలా ఉందని కూడా అలాగే అడిగారని, గదిలో ఏర్పాటు చేసిన సంగీతానికి కూడా స్పందిస్తున్నారని ఆయన అన్నారు. నాన్నను చూసినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఇక మీదట నాన్నను తరుచూ కలిసేందుకు ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. నాన్న కోసం ప్రార్థనలు చేస్తున్న వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

66

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి బులిటెన్ విడుదల చేసింది. ఎస్పీ బాలు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ఆ బులిటెన్ లో చెప్పారు.

ఎస్పీ చరణ్‌ వీడియో:https://www.instagram.com/p/CERmjwRB-32/

click me!

Recommended Stories