ఎప్పటి లాగే ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో కూడా టాలీవుడ్ కి మిశ్రమ ఫలితాలే ఎదురయ్యాయి. ఒకటి రెండు బ్లాక్ బస్టర్లు, కొన్ని హిట్లు, బోలెడన్ని ఫ్లాపులు నమోదయ్యాయి.
2026లో 6 నెలలు గడిచిపోయాయి. టాలీవుడ్ కి ఎప్పటిలాగే మిక్స్డ్ రిజల్ట్స్ తప్పలేదు. ఇంకా వాస్తవంగా మాట్లాడుకోవాలి అంటే ఫ్లాపులు ఎక్కువ హిట్లు తక్కువగా ఈ 6 నెలల్లో నమోదయ్యాయి. ఈ 6 నెలల్లో కొన్ని హిట్ చిత్రాలు ఉన్నాయి. క్లీన్ బ్లాక్ బస్టర్స్ లిస్ట్ లో చేరింది మాత్రం కేవలం 2 సినిమాలు మాత్రమే. అతి పెద్ద డిజాస్టర్స్ గా 2 సినిమాలు నిలిచాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
25
క్లీన్ బ్లాక్ బస్టర్లు 2 మాత్రమే
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం సంక్రాంతికి విడుదలై నిర్మాతలకు, బయ్యర్లకు అసలైన పండగ తెచ్చింది. కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం ఏకంగా బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాది తొలి క్లీన్ బ్లాక్ బస్టర్ గా మన శంకర వరప్రసాద్ గారు నిలిచింది. ఇక ఇటీవల విడుదలైన సమంత మా ఇంటి బంగారం మూవీ బిగ్ సర్ప్రైజింగ్ బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. సాధారణ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం మూడింతలు లాభాలు తెచ్చిపెడుతూ దాదాపు 70 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ లో చిరంజీవి, సమంత మాత్రమే మెరుపులు మెరిపించారు.
35
హిట్ సినిమాలు ఇవే
ఇక బయ్యర్లకి సేఫ్ జోన్ లో ఉంచుతూ ఎక్కువ ప్రాంతాల్లో లాభాలు అందుకుని హిట్ ముద్ర వేయించుకున్న చిత్రాలు కొన్ని ఉన్నాయి. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు చిత్రం సంక్రాంతి సీజన్ వాడుకుని హిట్ మూవీ గా నిలిచింది. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి కూడా బయ్యర్లకు సేఫ్ మూవీగా నిలిచింది. కపుల్ ఫ్రెండ్లీ, రాకాస, సింగ్ గీతం లాంటి చిత్రాలు యావరేజ్ గా నిలిచాయి.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ పెద్ది చిత్రాన్ని ట్రేడ్ విశ్లేషకులు కూడా ఎటూ తేల్చలేకపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించింది. సూపర్ హిట్ గా నిలిచింది. కానీ ఇది పాన్ ఇండియా మూవీ. కాబట్టి నార్త్, ఓవర్సీస్ రిజల్ట్ కూడా కీలకం. కానీ ఆ ఏరియాల్లో పెద్ది ఫ్లాప్ అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ కుమ్మేసింది కాబట్టి సూపర్ హిట్ అనలేం.. హిందీ, ఓవర్సీస్ లో కలెక్షన్స్ రాలేదు కాబట్టి ఫ్లాప్ అని అనలేం.
55
2 దారుణమైన ఫ్లాప్ సినిమాలు
2026 ఫస్ట్ హాఫ్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాలు అంటే ప్రభాస్ ది రాజా సాబ్, పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే చెప్పాలి. అత్యంత భారీ బడ్జెట్ లో విడుదలైన ప్రభాస్ ది రాజా సాబ్ మూవీ తొలి షో నుంచే దారుణమైన టాక్ సొంతం చేసుకుంది. ఫలితంగా కోట్ల మేరకు బయ్యర్లకు నష్టాలు తప్పలేదు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి కూడా పేవలమైన కలెక్షన్స్ నమోదయ్యాయి. అసలు ఈ చిత్రం పవన్ కళ్యాణ్ సినిమాకు ఉండాల్సిన హంగామాతో రిలీజ్ కాలేదు. ఏళ్లతరబడి షూటింగ్ ఆలస్యం కూడా దెబ్బేసింది. అదే విధంగా డెకాయిట్, ఫంకీ, గాయపడ్డ సింహం, యుఫోరియా లాంటి చిత్రాలు నిరాశ పరిచాయి.