Year Ender 2023: కలిసిరాని రీమేక్స్... మెగా బ్రదర్స్ కి షాక్స్!

Published : Dec 12, 2023, 03:06 PM IST

టాలీవుడ్ కి ఈ ఏడాది కలిసిరాలేదు. పరభాషా కథలు తెలుగులో సక్సెస్ కాలేదు. ముఖ్యంగా మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ డిజాస్టర్స్ చూశారు.   

PREV
17
Year Ender 2023: కలిసిరాని రీమేక్స్... మెగా బ్రదర్స్ కి షాక్స్!

పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ తర్వాత వరుసగా మూడు రీమేక్స్ చేశారు. బ్రో సినిమా షూటింగ్ అయితే 20 రోజుల్లో పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ ఉంటే చాలు సినిమా ఆడేస్తుందన్నట్లు చకచకా పూర్తి చేసి థియేటర్స్ లోకి వదిలారు. బ్రో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి సెట్ అయ్యే కథ కాదు. 

 

27

త్రివిక్రమ్ అసలు కథకు అవసరం లేని హంగులు దిద్ది ఆత్మను చంపేశారు. దాంతో వినోదాయసితం ఫ్లేవర్ బ్రోలో మిస్ అయ్యింది. సినిమా ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదు. దాంతో బ్రో నష్టాలు మిగిల్చింది. విరూపాక్ష సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సాయి ధరమ్ తేజ్ కి చేదు అనుభవం మిగిల్చింది. దానికి తోడు రాజకీయ వివాదాలు రాజేసింది. బ్రో చిత్రానికి సముద్ర ఖని దర్శకత్వం వహించారు. 

37

హీరో రవితేజకు 2023 మిక్స్డ్ ఫలితాలు ఇచ్చింది. ఆయన నటించిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ కొట్టింది. మెయిన్ లీడ్ చిరంజీవి అయినప్పటికీ రవితేజ పాత్రకు చాలా వెయిట్ ఇచ్చారు. అయితే రావణాసుర తో రవితేజ దెబ్బైపోయాడు. 

 

47

రావణాసుర బెంగాలీ థ్రిల్లర్ విన్సి దా అనే చిత్రానికి రీమేక్. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. రవితేజ నెగిటివ్ షేడ్స్ తో కూడిన రోల్ చేశారు. రావణాసుర కనీస వసూళ్లు రాబట్టడంలో రావణాసుర ఫెయిల్ అయ్యింది. అంచనాల మధ్య విడుదలైన టైగర్ నాగేశ్వరరావు కూడా పూర్తి స్థాయిలో మెప్పించలేదు. 

57
Rangamarthanda

దర్శకుడు కృష్ణవంశీ మరాఠీ హిట్ మూవీ నటసామ్రాట్ ని తెలుగులో రంగమార్తాండ చిత్రంగా తెరకెక్కించారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు చేశారు. శివాని రాజశేఖర్, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్ కీలక రోల్స్ చేశారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న రంగమార్తాండ కమర్షియల్ గా ఆడలేదు. 
 

67

భోళా శంకర్ మూవీతో చిరంజీవి భారీ డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నారు. వాల్తేరు వీరయ్య మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన చిరంజీవికి భోళా శంకర్ పెద్ద షాక్ ఇచ్చింది. భోళా శంకర్ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకుడు. తమన్నా హీరోయిన్. కీర్తి సురేష్ కీలక రోల్ చేసింది. 


 

77

ఎప్పుడో 2015లో విడుదలైన వేదాళం చిత్రానికి భోళా శంకర్ అధికారిక రీమేక్. ఈ మూవీ చేసినందుకు చిరంజీవి అభిమానులు కూడా నొచ్చుకున్నారు. రీమేక్స్ చేయకండి అన్నయ్య అంటూ సలహాలు ఇచ్చారు. భోళా శంకర్ ఫలితం తర్వాత చిరంజీవి మనసు మార్చుకున్నారు. లైన్లో పెట్టిన ఓ మలయాళ రీమేక్ ని సైడ్ చేశాడు. 2023లో హైప్ మధ్య విడుదలైన ఈ రీమేక్స్ పరాజయం పాలయ్యాయి. 

Read more Photos on
click me!

Recommended Stories