Published : Dec 12, 2023, 01:19 PM ISTUpdated : Dec 12, 2023, 01:34 PM IST
ఆదివారం ఎపిసోడ్లో నాగార్జున ఎల్లో కలర్ టీ షర్ట్ ధరించారు. అది ప్రేక్షకులతో పాటు హౌస్ మేట్స్ ని కూడా ఆకర్షించింది. వెంటనే అమర్ దీప్ మీరు ధరించిన టీషర్ట్ చాలా అందంగా ఉంది. నాకు ఇస్తారా? అని అడిగాడు.
బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున డ్రెస్సింగ్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. కలర్ఫుల్ గా, చాలా డిఫరెంట్ గా ఆయన బట్టలు ఉంటాయి. అయితే నాగార్జున ధరించే ఆ బట్టలన్నీ అంతర్జాతీయ బ్రాండ్స్ కి చెందినవి. వాటి ధరలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.
26
Bigg Boss Telugu 7
గత ఆదివారం ఎపిసోడ్లో నాగార్జున ఎల్లో కలర్ టీ షర్ట్ ధరించారు. అది ప్రేక్షకులతో పాటు హౌస్ మేట్స్ ని కూడా ఆకర్షించింది. వెంటనే అమర్ దీప్ మీరు ధరించిన టీషర్ట్ చాలా అందంగా ఉంది. నాకు ఇస్తారా? అని అడిగాడు. నాగార్జున మాత్రం అస్పష్టంగా సమాధానం చెప్పాడు.
36
Bigg Boss Telugu 7
అమర్ దీప్ ఆశపడిన ఆ టీ షర్ట్ నాగార్జున ఇచ్చే ఛాన్స్ లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కారణం దాని ధర లక్షల్లో ఉంది. కొందరు ఔత్సాహికులు ఆ టీ షర్ట్ ధర ఎంతని ఇంటర్నెట్ లో సెర్చ్ చేశారు. ఆ సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ టీ షర్ట్ ధర చూసి అందరి మైండ్ బ్లాక్ అయ్యింది.
46
క్రిస్టియన్ డియోర్ షార్ట్ స్లీవ్డ్ స్వెట్టర్ ధర అక్షరాలా రూ. 211190. ఒక టీ షర్ట్ ధర రెండు లక్షలకు పైన అంటే మామూలు విషయం కాదు. మరి అంత ఖరీదైన షర్ట్ అమర్ కి ఉచితంగా ఇచ్చేస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే ఆ షర్ట్ నాగార్జునది కూడా కాదు. ప్రొడక్షన్ వాళ్లది.
56
నాగార్జున కాస్ట్యూమ్ ప్రత్యేకంగా డిజైన్ చేయిస్తారు. ఆ ఖర్చు కూడా బిగ్ బాస్ నిర్మాతలే భరిస్తారు. గతంలో నాగార్జున తన షర్ట్ దానం చేసిన సందర్భాలు ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న ముక్కు అవినాష్ నాగార్జున ధరించి షర్ట్ కావాలని అడిగాడు. ఇస్తానని హామీ ఇచ్చిన నాగార్జున అవినాష్ ఎలిమినేషన్ రోజు గుర్తు పెట్టుకుని మరీ ఇచ్చాడు.
66
కాబట్టి నాగార్జున ఖరీదైన సదరు టీ షర్ట్ అమర్ కి ఇచ్చే అవకాశాలు లేకపోలేదని మరో వాదన వినిపిస్తోంది. మరోవైపు ఫినాలే రసవత్తరంగా మారింది. డిసెంబర్ 17న గ్రాండ్ ఫినాలే కాగా బిగ్ బాస్ ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ పేర్లు టైటిల్ రేసులో వినిపిస్తున్నాయి...