తమిళంలో దూసుకుపోతున్న సునిల్, భారీ రెమ్యునరేషన్ వసూలు చేస్తున్న స్టార్ కమెడియన్..

Mahesh Jujjuri | Published : Sep 21, 2023 5:10 PM
Google News Follow Us

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా వెలుగు వెలిగాడు సునిల్.. హీరోగా ఎంట్రీ ఇచ్చి..కెరీర్ లో ఎన్నో కుదుపులు చూశాడు. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సునిల్.. ఇప్పుడు తమిళంలో బిజీ అయ్యాడు. భారీగా డిమాండ్ చేస్తున్నాడట కూడా. 

15
తమిళంలో దూసుకుపోతున్న సునిల్, భారీ రెమ్యునరేషన్ వసూలు చేస్తున్న స్టార్ కమెడియన్..

టాలీవుడ్ లో ఎంతో కష్టపడి కమెడియన్ గా ఎదిగాడు సునిల్. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తో పాటు మ్యానరిజం కూడా  ఆడియన్స్ కు అలవాటు చేశాడు సునిల్. బ్రహ్మానందం లాంటి స్టార్ సీనియర్ కమెడియన్స్ కు కూడా పోటీ ఇచ్చిన సునిల్.. కెరీర పీక్స్ లో ఉండగానే హీరోగా ఎంట్రీ ఇచ్చి కెరీర్ ను డిస్ట్రబ్ చేసుకున్నాడు. హీరోగా సక్సెస్ అవ్వలేకపోయాడు. 

25

ఇక మళ్ళీ తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సునిల్. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్నాడు. కాని తెలుగు కంటే.. తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు సునిల్. తమిళంలో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. అక్కడ కూడా కమెడియన్ గా.. విలన్ గా వరుస అవకాశాలు ఆయన గుమ్మం మందుకు వచ్చి పిలుస్తున్నాయి. 

35

తెలుగులో అడపా దడపా సినిమాల్లో నటించినా మునుపటి జోష్ లో అయితే పాత్రలు రావడం లేదు.ఇలాంటి టైమ్ లో సునీల్ కి కోలీవుడ్ నుంచి మంచి ఛాన్స్ లభించింది. తమిళంలో సునీల్ నటించిన జైలర్ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అంతకు ముందు శివకార్తికేయన్ మహావీరన్ సినిమాలో కూడా విలన్ గా నటించి మెప్పించాడు సునిల్. తాజాగా జైలర్ సినిమాతో కోలీవుడ్ లో కూడా స్టార్ గా మారాడు. 

Related Articles

45

జైలర్ లో సునిల్ పాత్ర తమిళ ప్రేక్షకులకు బాగా నచ్చింది. దీంతో తమిళంలో సునీల్ కి మంచి ఆఫర్లు వస్తున్నాయి.ఇక లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ లో కూడా సునీల్ నటించాడు.అక్కడ సునీల్ పారితోషికం కూడా బారీగా పెరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం  తెలుగు సినిమాల 30 వేలు రోజుకు తీసుకుంటునన సునిల్.. తమిళంలో .. రోజుకు 60 వేల వరకూ ఇస్తున్నారట. 

55

ఇక సునిల్ తమిళంలో స్టార్ గా మారి.. చెన్నైలో సెటిల్ అయినా అవుతాడేమో అని అంటున్నారు ఫ్యాన్స్. మరి సునిల్ కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ.. బిజీగా ఉన్నాడు. చూడాలి ఆయన నెక్ట్స్ కెరీర్ అంతా తమిళ సినిమాలకే ఇస్తాడా..? లేక తెలుగుసినిమాలు కూడా ఎక్కువగా చేస్తాడా అని. 

Share this Photo Gallery
Google News Follow Us
Recommended Photos