విజయ్ సినిమా రంగాన్ని వీడి రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల సినీ పరిశ్రమకు ఎలాంటి నష్టం జరగదని తమిళనాడు థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపూర్ సుబ్రమణ్యం కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
"విజయ్ రాజకీయాల్లోకి వెళ్తే ఏంటి? విజయ్‌ను మించి వసూళ్లు రాబట్టడానికి ఇక్కడ చాలా మంది హీరోలు ఉన్నారు. విజయ్ స్థానంలోకి రావడానికి కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. సినిమా ఎప్పుడూ ఒకరిపై ఆధారపడి ఉండదు అంటూ అక్కసు వెళ్ళడించారు.
ఒకరు వెళ్లిపోతే, మరొకరు ఆ స్థానంలోకి వస్తారు. కాబట్టి విజయ్ సినిమా రంగాన్ని వీడినంత మాత్రాన అది మాకు పెద్ద నష్టం కాదు" అని తిరుపూర్ సుబ్రమణ్యం చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాక్యలు వైరల్ అవుతుండగా.. విజయ్ ఫ్యాన్స్ అతనిపై మండిపడుతున్నారు.