'టిల్లు స్క్వేర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. మామూలు బీభత్సం కాదు, ఆల్రెడీ 50 శాతం రికవరీ

Published : Mar 30, 2024, 02:32 PM ISTUpdated : Mar 30, 2024, 02:33 PM IST

టిల్లుగాడు ఈ వేసవిలో నవ్వుల జల్లులు కురిపిస్తూ సందడి షురూ చేశాడు. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ చిత్రం శుక్రవారం రోజు థియేటర్స్ లోకి వచ్చింది. 

PREV
16
'టిల్లు స్క్వేర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. మామూలు బీభత్సం కాదు, ఆల్రెడీ 50 శాతం రికవరీ

టిల్లుగాడు ఈ వేసవిలో నవ్వుల జల్లులు కురిపిస్తూ సందడి షురూ చేశాడు. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ చిత్రం శుక్రవారం రోజు థియేటర్స్ లోకి వచ్చింది. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. కానీ ఆ అంచనాలని కూడా అధికమించేలా టిల్లు బీభత్సం మొదలైంది. 

26
Tillu Square Movie Review

తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఫస్ట్ డే కలెక్షన్ ఇండస్ట్రీకి ట్రేడ్ వర్గాలకి కూడా షాక్ ఇచ్చే విధంగా నమోదయ్యాయి. టాప్ లీగ్ స్టార్ హీరో రేంజ్ లో టిల్లు స్క్వేర్ చిత్రానికి ఫస్ట్ డే ఓపెనింగ్స్ లభించాయి. తొలిరోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఏకంగా 23 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టింది. ఇందులో షేర్ 14 కోట్లకి పైగా నమోదైంది. 

36

ఈ చిత్రం సాధించాల్సిన బ్రేక్ ఈవెన్ నంబర్ 28 కోట్లు. అంటే బ్రేక్ ఈవెన్ లో తొలి రోజే ఈ చిత్రం దాదాపు 50 శాతం రికవరీ చేసేసింది. ఇది అమేజింగ్ ఫీట్ అనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 9.25 కోట్ల షేర్ సాధించింది. 

46

ఏరియాల వారీగా ఈ చిత్రం ఫస్ట్ డే సాధించిన వసూళ్లుఇలా ఉన్నాయి.. 

నైజాం                       : 4.30 కోట్లు 

సీడెడ్                       : 1.04 కోట్లు 

ఉత్తరాంధ్ర               :  1.29 కోట్లు 

ఈస్ట్                         : 75 లక్షలు 

వెస్ట్                          : 43 లక్షలు 

గుంటూరు                : 55 లక్షలు 

కృష్ణ                         : 50 లక్షలు 

నెల్లూరు                    : 39 లక్షలు 

ఏపీ - తెలంగాణ టోటల్ : 9.25 కోట్లు 

కర్ణాటక అండ్ రెస్టాఫ్ ఇండియా : 45 లక్షలు 

ఓవర్సీస్                      : 4. 60 కోట్లు 

వరల్డ్ వైడ్ టోటల్        : 14.30 కోట్ల (షేర్)

56

టిల్లు స్క్వేర్ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ అద్భుతంగా ఉంటాయని అంతా అంచనా వేశారు. కానీ ఈ రేంజ్ లో ఉంటాయని ఎవరూ ఊహించలేదు. జోరు ఇదే విధంగా కొనసాగితే టిల్లు స్క్వేర్ చిత్రం 100 కోట్ల మార్క్ అందుకోవడం పక్కా అని అంటున్నారు. 

66
Tillu Square

మాలిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ప్రేక్షకులు కోరుకున్న ఎంటర్టైన్మెంట్ పక్కగా ఇవ్వడంతో వసూళ్లు బ్లాస్ట్ అయిపోతున్నాయి. టిల్లు పాత్రలో సిద్దు జొన్నలగడ్డ చెలరేగిపోయినట్లు ఆడియన్స్ చెబుతున్నారు. 

 

click me!

Recommended Stories