చెప్పుకుంటే అసహ్యం, ఎన్టీఆర్ మూవీలో ఆ సన్నివేశాలు.. తప్పు చేశానని దేవుణ్ణి వేడుకున్న స్టార్ డైరెక్టర్

Published : Jun 11, 2025, 05:36 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఓ చిత్రంలోని సన్నివేశాల గురించి క్రేజీ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అలాంటి సన్నివేశాలు ఎందుకు చిత్రీకరించానా అని తాను ఎప్పుడూ బాధపడుతుంటానని ఆ డైరెక్టర్ తెలిపారు.

PREV
15
ఎన్టీఆర్ మూవీలో ఆ సన్నివేశాలు 

కొన్నిసార్లు గొప్ప దర్శకులు కూడా తప్పులు చేస్తుంటారు. సినిమా రిలీజ్ అయ్యాక ఆ చిత్రంలోని తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఓ చిత్రంలోని సన్నివేశాల గురించి క్రేజీ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అలాంటి సన్నివేశాలు ఎందుకు చిత్రీకరించానా అని తాను ఎప్పుడూ బాధపడుతుంటానని ఆ డైరెక్టర్ తెలిపారు. ఇంతకీ ఆ చిత్రం ఏంటి, ఆ డైరెక్టర్ ఎవరు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

25
మాస్ చిత్రాలకు బ్రాండ్ వివి వినాయక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీలో తీసిన కొన్ని సన్నివేశాల వల్ల బాధపడిన డైరెక్టర్ మరెవరో కాదు వివి వినాయక్. ఆయన చిత్రాలకు బ్రాండ్. వినాయక్ సినిమాలంటే హై ఓల్టేజ్ యాక్షన్ తో పాటు వినోదం కూడా ఉంటుంది. వివి వినాయక్, ఎన్టీఆర్ లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరి కాంబినేషన్ లో ఆది, అదుర్స్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. సాంబ లాంటి యావరేజ్ మూవీ కూడా వీరి కాంబినేషన్ లోనే వచ్చింది.

35
తప్పు చేశానని బాధపడ్డ వివి వినాయక్ 

కొన్నిసార్లు మెచ్యూరిటీ లేకపోవడం వల్ల తప్పులు జరుగుతుంటాయి. సాంబ మూవీ చిత్రీకరించే సమయంలో నాకు సరైన మెచ్యూరిటీ లేదు. ఆ చిత్రంలో రెండు సన్నివేశాలు విషయంలో నేనెప్పుడూ బాధపడుతుంటా. ఆ సన్నివేశాల గురించి మాట్లాడుకుంటేనే అసహ్యం అనిపిస్తుంది. నా కెరీర్ లో ఏదైనా రిగ్రెట్ ఉంది అంటే అది ఆ రెండు సన్నివేశాల వల్లే. సాంబ మూవీలో ప్రకాష్ రాజ్ తనకి వదిన వరుసయ్యే మహిళపై ఒక సైకోని ఉసిగొలుపుతాడు. అసలు అలాంటి సన్నివేశం నేను చిత్రీకరించకుండా ఉండాల్సింది.

45
వివి వినాయక్ ఎమోషనల్ 

ఆ సన్నివేశం చిత్రీకరించినందుకు ఎప్పుడూ దేవుణ్ణి క్షమాపణ వేడుకుంటుంటానని వివి వినాయక్ తెలిపారు. అదేవిధంగా ఆ చిత్రంలోనే తలనరికే సన్నివేశం కూడా ఒకటి ఉంటుంది. ఆ సన్నివేశం కూడా చిత్రీకరించకుండా ఉండాల్సింది అని వినాయక అన్నారు.

55
గాల్లోకి సుమోలు లేపే డైరెక్టర్

తనపై గాల్లోకి సుమోలు లేపే డైరెక్టర్ అని ముద్ర వేశారు. వాస్తవానికి నేను సుమోలతో అలాంటి సన్నివేశాలు చిత్రీకరించింది ఆది, చెన్నకేశవరెడ్డి లో మాత్రమే. కానీ నాపై ఆ ముద్ర పడిపోయింది అని వివిధ వినాయక్ తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories