Director Krishna Vamsi: టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో అత్యంత చెత్త సినిమాలు ఏంటో వివరించారు. ఆ సినిమాల ఫెయిల్యూర్ వెనుక వివిధ కారణాలు ఉన్నాయన్నారు.
వైవిధ్యమైన సినిమాలకు పెట్టింది పేరు దర్శకుడు కృష్ణవంశీ. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లతో ఒకరిగా వెలుగొందిన కృష్ణవంశీ.. ఇప్పుడు ఆఫర్లు లేక సతమతమవుతున్నారు. ఈ తరుణంలో తన కెరీర్‌లో అత్యంత చెత్త సినిమాలపై కీలక విషయాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
25
సుమారు 20 చిత్రాలకు దర్శకత్వం
తన కెరీర్‌లోని సుమారు 20 చిత్రాలకు దర్శకత్వం వహించానన్నారు. ఆ 20 చిత్రాల్లో తనకు అత్యంత చెత్తగా అనిపించినవి మొగుడు, పైసా మూవీస్ అని స్పష్టం చేశారు. అవి రెండు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.
35
ఒకడి మోసం వల్ల..
గోపీచంద్ హీరోగా వచ్చిన మొగుడు చిత్రాన్ని చాలా నమ్మకంతో మొదలుపెట్టినా.. ఒకడి మోసం వల్ల, ప్రొడక్షన్ కండిషన్స్ వల్ల ఆ మూవీ తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. పైసా మూవీ కూడా అలాంటి లోపాలతోనే ఫెయిల్యూర్ అయిందన్నారు.
ఈ రెండు చిత్రాల వైఫల్యానికి తన అసమర్థత, అసహాయతలే కారణమని కృష్ణవంశీ అంగీకరించారు. అదే సమయంలో, తన ఉత్తమ చిత్రాల జాబితాను కూడా కృష్ణవంశీ వెల్లడించారు.
55
టాప్ వర్క్స్ ఆ సినిమాలే..
చందమామ, మురారి, అంతఃపురం, ఖడ్గం చిత్రాలను తన టాప్ వర్క్స్‌లో చేర్చారు. ముఖ్యంగా, డేంజర్ చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌లో (80 లక్షలు) అద్భుతంగా రూపొందించానని, దానిపై తనకు ఎంతో సంతృప్తి ఉందని ఆయన తెలిపారు. ఆ బడ్జెట్‌కు, ఆ సెటప్‌కు అది చాలా మంచి చిత్రమని ఆయన అభిప్రాయపడ్డారు.