వారణాసి మూవీకి మహేష్, రాజమౌళి నో రెమ్యునరేషన్లు.. మరి ఏంటంటే.?

Published : Feb 09, 2026, 07:00 AM IST

Varanasi Movie: వారణాసి చిత్రానికి ఎస్ఎస్ రాజ‌మౌళి పారితోషికం తీసుకోకుండా ఓవర్సీస్ రైట్స్ లాభాలను తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే దారిలో హీరో మహేష్ బాబు కూడా శాటిలైట్ రైట్స్ లాభాల్లో షేర్ తీసుకుంటాడని టాక్. 

PREV
15
వారణాసి మూవీపై వార్త..

దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరో మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'వారణాసి'. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్స్తోన్న ఈ చిత్రాన్ని సుమారు రూ. 1300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరో మహేష్ బాబు రెమ్యునరేషన్లు తీసుకోవట్లేదని టాక్. మరి ఏంటని అనుకుంటున్నారా.?

25
ఓవర్సీస్ హక్కులు పారితోషికంగా?

వారణాసి మూవీ కోసం ఎస్ఎస్ రాజ‌మౌళి పారితోషికం తీసుకోకుండా.. అందుకు బదులు ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు తన భాగంగా తీసుకోనున్నట్టు టాక్. ఇప్పటికీ ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ దాదాపుగా రూ. 160 కోట్లు లేదా అంతకంటే ఎక్కువకు అమ్ముడవనున్నట్టు టాక్. దాన్ని దర్శకుడు తీసుకోనున్నాడని సమాచారం.

35
మహేశ్‌బాబు కూడా అదే దారిలోకి

ఈ సినిమాకు మహేష్ బాబు కూడా రెమ్యునరేషన్ బదులుగా శాటిలైట్ రైట్స్ తీసుకుంటాడని తెలుస్తోంది. అది మొత్తంగా రూ. 200 కోట్లు ఉంటుందని సమాచారం. పృథ్వీరాజ్ సుకుమరాన్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ హీరోలు అందరూ రెమ్యునరేషన్ బదులుగా రైట్స్‌లో భాగాన్ని తీసుకుంటున్నారు.

45
సినిమాలో ప్రాఫిట్ షేరింగ్ మోడల్

రెమ్యునరేషన్ బదులుగా సినిమాలో ప్రాఫిట్ షేరింగ్ మోడల్ తీసుకోవడం ఇదేం కొత్త కాదు. గతంలోనూ పలు సినిమాలకు పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఈ విధంగా కోట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే 'వారణాసి'కి సంబంధించి ఇదొక రూమర్ మాత్రమే. అధికారికంగా దర్శకనిర్మాతల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

55
పారితోషికం బదులుగా లాభాల హక్కులు

సినిమా నిర్మాణ వ్యయం పెరుగుతున్న కొద్దీ హీరోలు, దర్శకులు తమ సంప్రదాయాలను పక్కన పెట్టి.. పారితోషికం బదులుగా లాభాల హక్కులు, ఓవర్సీస్ డీల్‌లలో భాగాన్ని తీసుకుంటున్నారు. ఇక 'వారణాసి' పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోంది. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories